Home » ప్రభాస్ సలార్ మూవీ వాయిదా..? విడుదల అప్పుడేనా ?

ప్రభాస్ సలార్ మూవీ వాయిదా..? విడుదల అప్పుడేనా ?

by Anji
Ad

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా అభిమానులు వేయి కన్నులతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ కోసం ఇటు ప్రభాస్, అటు ప్రశాంత్ నీల్  అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నారు. అయితే తాజాగా ప్రభాస్ మూవీ వాయిదా అంటూ సోషల్ మీడియాలో రెండు మూడు రోజుల నుంచి తెగ వైరల్ అవుతోంది. 

Advertisement

సెప్టెంబర్ 28న విడుదలవుతుందని.. ఇందులో భాగంగానే ఇటీవలే టీజర్ ని వదిలారు. ఇప్పుడు ట్రైలర్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో అప్పుడే అడ్వాన్స్ సేల్స్ ద్వారా ఈ మూవీ హాఫ్ మిలియన్ డాలర్లను కూడా వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రభావాన్ని చూపిస్తోంది. సలార్ ఫిల్మ్ వాయిదా అని ఇప్పటికే దీనికి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్‌లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న సమయంలో ఈ సినిమా వాయిదా పడినట్లు తాజాగా ఓ వార్త ద్వారా  లీకైంది.

Advertisement

 

సలార్ మూవీ  సెప్టెంబర్ 28న రిలీజ్ కావడం లేదు అని.. ఈ చిత్రం వాయిదా పడినట్లు డౌట్ రావడానికి రీజన్ కూడా లేకపోలేదు నిన్నటి వరకు సినిమా బుకింగ్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండగా.. ఉన్నట్లుండి టికెట్ల అమ్మకాలను నిలిపివేశారు. మరోవైపు   ఓవర్సీస్ బయ్యర్లు థియేటర్ల యాజమాన్యాలకు సమాచారం కూడా అందించారని టాక్. డోసు పెంచి గేట్లు లేపిన హీరోయిన్.. అందాలన్నీ కనిపించేలా బట్టల్లో షో ఆ సీన్స్‌ క్వాలిటీనే సమస్య అని తెలుస్తోంది.  ‘సలార్’ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిందన్న వార్త లీక్ అవడంతో పాటు దానికి సంబంధించిన కారణాలు కూడా బయటకు వచ్చాయి. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌పై ప్రశాంత్ నీల్ అసంతృప్తిగా ఉన్నాడట. కొన్ని షాట్లపై రీ వర్క్ జరుగుతుందని, దీనికి సమయం పట్టే అవకాశం ఉండడం వల్లే వాయిదా వేశారని తెలుస్తోంది. మరోవైపు  ప్రభాస్ కాలు కూడా రీజనే అని..’సలార్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను పెట్టాలని ప్లాన్ చేశారట. దీన్ని షూట్ చేద్దాం అనుకున్న సమయంలోనే ప్రభాస్ మోకాలి సమస్య ఎక్కువైనట్లు తెలిసింది. మొత్తానికి ఏ చిత్రం వాయిదా పడినట్టు తెలుస్తోంది. చిత్ర యాజమన్యం అధికారికంగా ఓ క్లారిటీ ఇస్తే కానీ తెలియదు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

హరి హర వీరమల్లు పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. విడుదల ఎప్పుడంటే..? 

JAWAN FIRST REVIEW : షారుఖ్ ‘జవాన్’ ఫస్ట్ రివ్యూ .. ఎలా ఉందంటే ?

Visitors Are Also Reading