Home » “సలార్” క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందా..గూస్ బంప్స్ తెప్పించే లేటెస్ట్ అప్డేట్..!!

“సలార్” క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందా..గూస్ బంప్స్ తెప్పించే లేటెస్ట్ అప్డేట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు.. పాన్ ఇండియా సినిమాల్లో నటించి ఆయన తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. జక్కన్న ఆయన సినీ కెరీర్ ని మార్చేశారని చెప్పవచ్చు. బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ ఎంతటి ఆదరాభిమానాలు సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అప్పటినుంచి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఆయన తాజాగా చేస్తున్న ప్రాజెక్టుల్లో సలార్ ప్రాజెక్టు పై అభిమానులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి..

Advertisement

also read:భార్య ఈ 3 రహస్యాలను భర్తకు అస్సలు తెలియనివ్వదు..ఇందులో 1 చాలా ఇంపార్టెంట్..!!

Advertisement

ఈ మూవీ లో భారీ యాక్షన్ సీన్స్ చూడబోతున్నామని, ఇప్పటికే వస్తున్నా అప్డేట్స్ ఫ్యాన్స్ లో మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెలుగు, తమిళ,కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.దీంతో ఇండియా మొత్తం అభిమానుల్లో ఒక రకమైన ఆత్రుత ఏర్పడింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. కేజిఎఫ్ లాంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన డైరెక్టర్ ప్రభాస్ సలార్ సినిమాలో అంతకంటే ఎక్కువ రేంజ్ లో సీన్స్ ఉండేలా షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న తరుణంలో సలార్ కోసం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

సినిమా విడుదలకు ముందే ఈ మూవీపై ఏర్పడినటువంటి అంచనాలతో ట్రేడ్ వర్గాల్లో భారీ డిమాండ్ నెలకొంది. ఈ మేరకు సలార్ మూవీ హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడే అవకాశముందని తెలుస్తోంది. తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం సలర్ మూవీ లో క్లైమాక్స్ ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో ఎక్కడా చూడలేదని, కేజిఎఫ్ సినిమాలో ఏ విధంగా అయితే క్లైమాక్స్ ఉందో దానికి మించి వేరే లెవల్లో సలార్ మూవీ క్లైమాక్స్ ఉండబోతోందని సమాచారం.. ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

also read:

Visitors Are Also Reading