Home » బాహుబలి మాదిరిగానే బాలయ్య అన్ స్టాపబుల్ 2 లో ప్రభాస్ ఎపిసోడ్..!

బాహుబలి మాదిరిగానే బాలయ్య అన్ స్టాపబుల్ 2 లో ప్రభాస్ ఎపిసోడ్..!

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రతీ వారం ఈ షోకి గెస్ట్ లు వస్తూ బాలయ్యతో సందడి చేస్తుంటారు. డిసెంబర్ 30 శుక్రవారం బాలయ్యతో సందడి చేసేందుకు పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ విచ్చేస్తున్నారు. ప్రభాస్, బాలయ్య ఒకే వేదికపై కొన్ని గంటల పాటు సందడి చేస్తారంటే ఆసక్తి చూపించని వారు ఎవ్వరుంటారు.? ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 2లో బాహుబలి స్టార్ ప్రభాస్ పాల్గొంటున్నారని తెలిసినప్పటి నుంచి ఆ ఎపిసోడ్ పై అభిమానులలో ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. 

Advertisement

బాలయ్య హోస్ట్ గా ప్రభాస్ గెస్ట్ గా సాగిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఈ నెల 30న ప్రసారం కానుంది. ఇక ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ కి సంబంధించి గ్లింప్స్ రెండు సార్లు, టీజర్ అంచనాను భారీగానే పెంచేశాయి. ఇక ఇలాంటి సమయంలోనే అభిమానులకు మరో శుభవార్త అనే చెప్పాలి. ఏంటంటే.. ఈ ఎపిసోడ్ రెండు పార్ట్ లుగా ప్రసారం కానుందట. ఇప్పటి వరకు అన్ స్టాపబుల్ షోలో ఏ గెస్ట్ కి దక్కి విధంగా ప్రభాస్ కి ఈ గౌరవం దక్కించదనే చెప్పవచ్చు. ప్రభాస్ తో దర్శకధీరుడు రాజమౌళి  తెరకెక్కించిన బాహుబలి సైతం ప్రారంభంలో ఒక సినిమాగానే మొదలుపెట్టారు. కానీ అందులో కథ, కథనం, నిడివి పెరగడంతో ఆ తరువాత రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇప్పుడు  బాలయ్య టాక్ షో లో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ లో ఏది ట్రిమ్ చేయనంత ఆసక్తికరంగా ఉంటుందట. 

Advertisement

Also Read :  ప్రభాస్ కి ఉన్న ఒకే ఒక బలహీనత అదే.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్ శ్రీను..!!

Unstoppable 2 : Manam News

దీంతో ఏ మాత్రం ఎడిట్ చేయకుండా ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నారు. “అసలు కంటెంట్ ఎంత బాగుందంటే ఎడిట్ చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు” అని ఆహా బృందం పేర్కొంటుంది. మాహిష్మతి ఊపిరి పీల్చుకో.. హీ ఈజ్ ఆన్ దవే.. అంటూ సందడి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 30న ప్రసారమయ్యే తొలి ఎపిసోడ్ లో ఎన్ని ముచ్చట్లు.. ఎన్ని ప్రశ్నలుంటాయో..? జనవరి 06న మరెన్ని ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటాయో చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా ముగింపులో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న వదిలారు. ఆ ప్రశ్నతోనే రెండో భాగానికి క్రేజీ పెరిగింది. డిసెంబర్ 30న ప్రసారమయ్యే ఎపిసోడ్ లో కూడా ఎండింగ్ లో ఓ ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుందని తెలుస్తోంది. అది ఏంటో తెలియాలంటే అప్పటివరకు వేచి చూడాల్సిందే.  

Also Read :  బాహుబలి 2 కి పొన్నియిన్ సెల్వన్ 2 కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా ? 

Visitors Are Also Reading