Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ప్రభాస్ కి ఉన్న ఒకే ఒక బలహీనత అదే.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్ శ్రీను..!!

ప్రభాస్ కి ఉన్న ఒకే ఒక బలహీనత అదే.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్ శ్రీను..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్..క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ప్రభాస్ శ్రీను అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రభాస్ శీను. ఈయన ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరో అయిన ప్రభాస్ కు వ్యక్తిగత అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ కు సంబంధించిన అన్ని విషయాలను ఆయన దగ్గరుండి చూసుకుంటారట. అయితే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన కామెడీతో అదరగొట్టిన ప్రభాస్ శ్రీను అంతకుముందులా సినిమాల్లో కనిపించడం లేదు.

Advertisement

Ad

also read;ఈ 10 మంది హీరోయిన్లు డ్యాన్స్ తో ఇండియన్ సినిమాని షేక్ చేసేశారు..!

Advertisement

అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రభాస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. సత్యానంద్ ఇనిస్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకునే సమయంలో ప్రభాస్ తో పరిచయం ఏర్పడిందని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. ఎప్పటినుంచో ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉంటున్నానని అన్నారు. ప్రభాస్ ను రాజుగానూ, తానని మంత్రిగానూ కృష్ణంరాజు గారు ఎప్పుడు చెబుతుండేవారు.

కానీ ప్రభాస్ మాత్రం అప్పటినుంచి ఇప్పటివరకు ఒకే విధంగా ఉన్నారని, స్టార్ డం వచ్చినా కానీ ఆయన ఏమాత్రం మారలేదని తెలియజేశారు. ప్రభాస్ కు మంచితనమే ప్లస్ అని, బలహీనతే మైనస్ అని పేర్కొన్నాడు. ఇక ఆయన కోపం వచ్చిందంటే అస్సలు మాట్లాడడని, ఆయన ప్రేమ ఎంత చూపిస్తారో కోపంతో ఉన్నప్పుడు అంతే మౌనంగా ఉంటారని, ఆ మౌనం భయంకరంగా ఉంటుందని తెలియజేశారు ప్రభాస్ శ్రీను.

Also read;మోహన్ బాబు, మురళీమోహన్ చొక్కాలు పట్టుకొని మరీ కొట్టుకున్నారు.. కారణం మంచు విష్ణుయేనా..?

Visitors Are Also Reading