Home » బాహుబలి 2 కి పొన్నియిన్ సెల్వన్ 2 కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా ? 

బాహుబలి 2 కి పొన్నియిన్ సెల్వన్ 2 కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా ? 

by Anji
Published: Last Updated on
Ad

Ponniyan Selvan 2: తమిళ అగ్ర దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ సినిమా పొన్నియిన్ సెల్వన్. సెప్టెంబర్ 30, 2022న పాన్ ఇండియా లెవల్ లో విడుదలైంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు సహా పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసారు.

Advertisement

పొన్నియిన్ సెల్వన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చారిత్రక కోలీవుడ్ లో కలెక్షన్లు పరంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రెండు వారాలలో వరల్డ్ వైడ్ గా రూ.460 కోట్లకు పైగా.. ఈ సినిమా కలెక్లన్లను రాబట్టింది. ఈ చిత్రం తమిళంలోనే సరికొత్త రికార్డును సృష్టించింది.  పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ గా పొన్నియిన్ సెల్వన్ 2 వస్తున్న విషయం తెలిసిందే.  

Also Read :  మోహన్ బాబు, మురళీమోహన్ చొక్కాలు పట్టుకొని మరీ కొట్టుకున్నారు.. కారణం మంచు విష్ణుయేనా..?

Advertisement

బాహుబలి, బాహుబలి 2 మాదిరిగానే పొన్నియిన్ సెల్వన్, పొన్నియిన్ సెల్వన్ 2 వస్తుంది. మరో విశేషం ఏంటంటే.. రాజమౌళి బాహుబలి 2ని విడుదల చేసిన రోజునే అనగా ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ విడుదల చేయనున్నారు. దర్శకుడు మణిరత్నం పొన్నియిన్  సెల్వన్ విడుదల సమయంలో ఓ ప్రెస్ మీట్ లో.. పొన్నియిన్ సెల్వన్ తీయడానికి రాజమౌళి బాహుబలి సిరీస్ తో చూపిన బాటనే ప్రేరణ అని పేర్కొనడం గమనార్హం.  బాహుబలి 2 విడుదలైన రోజే పొన్నియిన్ సెల్వన్ 2 విడుదల చేయడాన్ని చూస్తుంటే.. రాజమౌళిని దర్శకుడు మణిరత్నం ఎంత స్ఫూర్తి తీసుకున్నాడో స్పష్టమవుతోంది.  

Also Read :  ప్రభాస్ కి ఉన్న ఒకే ఒక బలహీనత అదే.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్ శ్రీను..!!

Visitors Are Also Reading