Home » Prabhas: హీరో కాకపోయి ఉంటే ఆ పని చేసేవాడిని..!!

Prabhas: హీరో కాకపోయి ఉంటే ఆ పని చేసేవాడిని..!!

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆరడుగుల అందగాడు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది యంగ్ హీరో ప్రభాస్.. ఈయన పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు ఉన్న హీరో. అలాంటి ప్రభాస్ తాజాగా అన్ స్టాపబుల్ విత్ నందమూరి బాలకృష్ణ షోకు విచ్చేశారు. ఈ యంగ్ రెబల్ స్టార్ షో ను చూడడానికి ఒకేసారి జనాలు అంతా ఎగబడ్డారట. 40 ఏళ్ల వయసు దాటినా కానీ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ పెళ్లెప్పుడు చేసుకుంటారని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఆయన అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఈయన పెళ్లిపై ఆరా తీస్తున్నారు.

Advertisement

also read;నటుడు పద్మనాభం ను సొంత కొడుకు కూడా మోసం చేశాడని మీకు తెలుసా..?

అందరూ ఆయన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రభాస్ మాత్రం చేతినిండా పాన్ ఇండియా ప్రాజెక్టులతో వందల కోట్ల పారితోషికంతో ముందుకు పోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలు అన్నిటికీ కలిపి 400 కోట్ల నుంచి 500 పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.. భారత చలనచిత్ర రంగంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి ప్రభాస్ సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఎలా ఉండేది.. మనం ఈ మాట అనడానికి బాలేదు కదూ..

Advertisement

ఒకవేళ ప్రభాస్ సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏం చేసేవాడో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. ఒకవేళ సినిమా రంగంలో నేను రాకపోయి ఉంటే వ్యాపారంగంలోకి అడుగు పెట్టే వాడినని అన్నాడు. తాను ఎప్పుడు కూడా ఇలా హీరో అవుతానని అనుకోలేదని, చిన్నతనం నుంచే వ్యాపారాలు చేయాలని కలలు కనే వాడినని, ఎక్కువగా హోటల్ బిజినెస్ పై ఆసక్తి ఉండేదని తెలియజేశారు. అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అందుకే నేను వ్యాపారం చేయాలని భావించలేదు. ఆ తర్వాత మెల్లిగా సినిమా రంగంలోకి వచ్చి ఇలా అయ్యానంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.

also read;స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ ఆ మూవీ అప్పులు తీర్చేందుకు 5 ఏళ్ళు పట్టిందట..!!

Visitors Are Also Reading