Home » స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ ఆ మూవీ అప్పులు తీర్చేందుకు 5 ఏళ్ళు పట్టిందట..!!

స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ ఆ మూవీ అప్పులు తీర్చేందుకు 5 ఏళ్ళు పట్టిందట..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ దర్శకులలో కాస్త సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఈయన సినిమాలు అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటుగా విభిన్నమైన కథాంశాలు ఉంటాయి. గులాబీ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు కృష్ణ వంశీ. రాంగోపాల్ వర్మ శిష్యుడు. మురారి, చంద్రలేఖ,నిన్నే పెళ్ళాడుతా, ఖడ్గం, చందమామ వంటి ఎన్నో బాక్సాఫీస్ సెన్సేషనల్ క్రియేట్ చేసిన సినిమాలకు దర్శకత్వం వహించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు..

Advertisement

also read;విడాకుల కోసం భార్యని టార్చర్ పెడుతున్న స్టార్ హీరో ..?

కానీ స్టార్ హీరోలతో ఆయన సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పవచ్చు. అయినా ఈ దర్శకుడికి క్రేజ్ తగ్గలేదు. అయితే కృష్ణవంశీ కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చిన సమయంలో సింధూరం అనే మూవీని తెరపైకి తీసుకువచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ అనుకున్న సక్సెస్ను సాధించలేదు. అయితే కృష్ణవంశీ తన సొంత ప్రొడక్షన్లో ఈ సినిమా చేశారు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడటంతో నష్టాల్లో మునిగిపోయారు.

Advertisement

ఈ సినిమా ద్వారా అయినా అప్పులను తీర్చడానికి ఐదు సంవత్సరాల సమయం పట్టిందని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు కృష్ణవంశీ. అయితే సింధూరం సినిమాకు ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులోని పాటల గురించి అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. తాజాగా ఒక అభిమాని సింధూరం సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేయాలని కోరగా, ఆ సినిమా అప్పులను తీర్చడానికే నాకు ఐదేళ్లు పట్టింది అంటూ కృష్ణవంశీ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన రంగమార్తాండ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది .

also read;టమాటా గింజల్లో విషం ఉంటుందా ? వారు తింటే ఆ సమస్య తప్పదు..!

Visitors Are Also Reading