ఒకానొక సమయంలో అగ్ర నటుడుగా ఒక వెలుగు వెలిగిన ఈ నటుడు ఎంతో సంపాదించి చివరికి కొంతమంది చేతిలో మోసపోయి చాలా ఇబ్బందుల పాలయ్యాడు. తన కుటుంబ సభ్యులు కూడా ఈ నటుడిని మోసం చేయడం సంచలనంగా మారింది. ఈ విధంగా మోసపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడిన వారిలో రాజబాబు, సావిత్రి,పద్మనాభం వంటి నటులు ఉన్నారు. ఇక జీవితం చివరి దశలో ఉన్నప్పుడు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డారు. రేలంగి తర్వాత స్థాయిలో పేరు తెచ్చుకున్న కమెడియన్ పద్మనాభం.
Advertisement
Advertisement
ఆయనకు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు ఉంది. తన కెరీర్ లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించిన పద్మనాభం ఆర్థిక వ్యవహారాల విషయంలో విపరీతంగా మోసపోయాడు. దీనికి ప్రధాన కారణం అందరూ మనవారే అనుకోని గుడ్డిగా నమ్మడం. అలా పద్మనాభం ఎన్నో కష్టాలు పడి సంపాదించిన ఆస్తులని స్నేహితులకు అప్పజెప్పడంతో వారు చివరికి మోసం చేసి ఉన్నదంతా లాక్కున్నారట. ఇక సొంత కొడుకు కూడా మిగిలిన ఆస్తులు తీసుకొని చివరికి ఆయనను అనేక సమస్యలకు గురి చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా కొన్ని సినిమాలకు ఆయన నిర్మాతగా చేసి భారీగా నష్టాల పాలయ్యారని తెలుస్తోంది. ఈ విధంగా కమెడియన్ పద్మనాభం తను మరణించే వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన చివరి రోజుల్లో మాత్రం కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తూ చివరికి 2010 ఫిబ్రవరి 20న ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విధంగా పద్మనాభం నమ్మిన వారి చేతిలోనే మోసపోయి చనిపోవడం బాధాకరం.
Advertisement
also read;Veera Simha Reddy Movie Dialogues: వీరసింహారెడ్డి పవర్ ఫుల్ డైలాగ్స్