Home » టాలీవుడ్ లో ప్రభాస్ ని మించిన హీరోనే లేడు అనడానికి సాక్ష్యం ఈ లెక్కలేనా?

టాలీవుడ్ లో ప్రభాస్ ని మించిన హీరోనే లేడు అనడానికి సాక్ష్యం ఈ లెక్కలేనా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

టివి, ఓటిటీలు, స్మార్ట్ ఫోన్ లు పెద్దగా లేని రోజుల్లో సినిమా అంటే కనీసం వంద రోజుల పాటు థియేటర్లలో ఆడుతూ ఉండేవి. వంద రోజులు సినిమా ఆడితే దాన్ని సూపర్ హిట్ గా చెప్పుకునేవారు. ఎన్ని ఎక్కువ రోజులు సినిమా ఆడితే.. ఆ సినిమా అంత ఎక్కువ హిట్ అయినట్లు చెప్పుకునేవారు. కానీ, స్మార్ట్ ఫోన్ లు ఓటిటీలు వచ్చిన తరువాత ఈ లెక్కలు మారాయనే చెప్పాలి. ఎన్ని రోజులు థియేటర్లో ఆడింది అనేది లెక్క కాదు.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేదే లెక్క.

Advertisement

ఎందుకంటే ఇప్పుడొచ్చే సినిమాలేవీ థియేటర్లలో నెలల తరబడి ఆడడం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలే పదిహేను రోజులు, నెలకు మించి థియేటర్లలో ఆడట్లేదు. అయితే.. రిలీజ్ కి ముందే టికెట్స్ తీయడం మొదలైపోతోంది. ప్రి రిలీజ్ బిజినెస్, థియేట్రికల్ కలెక్షన్, డిజిటల్ రైట్స్ కలెక్షన్ పేరిట ఓ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే దాన్ని బట్టే ఆ సినిమా సక్సెస్ ఉంటుంది.

Here's why 'Salaar' star Prabhas failed to cast his vote

Advertisement

లాంగ్ రన్ లో ఎక్కువ కలెక్షన్ సాధించిన సినిమాలనే హిట్ లుగా చెప్పుకుంటున్నాం. ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలను ఎంచుకుంటే ఆంధ్ర లో కంటే తెలంగాణలోనే కలెక్షన్స్ ఎక్కువ. తెలంగాణ మొత్తం నైజాం కిందకు వస్తుంది. ఈ లెక్కన ఆంధ్రతో పోలిస్తే నైజాంలో థియేటర్లు కూడా తక్కువే. అయినా నైజాం నుంచే కలెక్షన్ ఎక్కువ వస్తుంది. ఇక నైజాంలో డార్లింగ్ నే కలెక్షన్ కింగ్ అని చెప్పుకుంటుంటారు.

ఆయన హీరోగా నటించిన నాలుగు సినిమాలు రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించారు. ఇక వంద కోట్ల కలెక్షన్లు రాబట్టిన సినిమాలను చూస్తే.. ఆర్ ఆర్ ఆర్, సలార్, బాహుబలి.. వీటిల్లో కూడా రెండు సినిమాలు ప్రభాస్ వే. ఇక అలా వైకుంఠ పురం కూడా నైజాం లో డెబ్భై కోట్ల కలెక్షన్ సాధించింది. కానీ పుష్పాకి మాత్రం ఇక్కడ కలెక్షన్స్ పెద్దగా రాలేదట. అరవై కోట్లను మాత్రమే క్రాస్ చేసింది. మహేష్ సరిలేరు నీకెవ్వరూ కూడా అరవై కోట్లను క్రాస్ చేసింది. వాల్తేరు వీరయ్య, ఆదిపురుష్ సినిమాలు కూడా అరవై కోట్ల కలెక్షన్ సాధించాయి. ఈ లెక్కన ఎక్కువ సినిమాలు ప్రభాస్ వే నైజాం లో అధిక కలెక్షన్ సాధించాయి. ఈ లెక్కన ప్రభాస్ టాప్ లో ఉన్నాడనే చెప్పొచ్చు.

Visitors Are Also Reading