Home » సలార్ సినిమాలో ప్రభాస్ గొడ్డు కారం తినడానికి కారణం ఏంటి? దీని వెనుక ఇంత కథ ఉందా?

సలార్ సినిమాలో ప్రభాస్ గొడ్డు కారం తినడానికి కారణం ఏంటి? దీని వెనుక ఇంత కథ ఉందా?

by Srilakshmi Bharathi
Ad

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా “సలార్”. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇటు ప్రభాస్ అభిమానులతో పాటు.. ప్రభాస్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే.. ఈ సినిమా గురించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సలార్ సినిమాలో మీరు ఒక విషయం గమనించారా? ఈ సినిమాలో హీరో ప్రభాస్ ఎప్పుడు భోజనం చేసినా.. అందులో గొడ్డు కారం మాత్రమే కలుపుకుంటూ ఉంటాడు.

Advertisement

అయితే.. ప్రభాస్ ఇలా ఎందుకు తింటాడు? సినిమా అంతా ఇలానే ఎందుకు చూపించారు అని చాలా మంది అభిమానులకు సందేహం వచ్చింది. అయితే.. ఇలా చూపించడానికి కూడా ఓ కారణం ఉంది. దానిని ప్రశాంత్ నీల్ ఓ సన్నివేశం ద్వారా పరోక్షంగా చూపించారు. ఈ సినిమాలో ఓ చిన్న పాప తన పుట్టినరోజు సందర్భంగా కేక్ తీసుకొచ్చి కొయ్యమని ప్రభాస్ కు చాక్ ఇస్తుంది. వెంటనే ప్రభాస్ తల్లి వచ్చి ముందు నువ్వు చాక్ ఇచ్చేయ్ నాన్నా అంటూ ఆ చాక్ ని భయపడుతూ తీసేసుకుంటుంది.

Advertisement

అంటే.. చేతిలో చాక్ ఉంటె ప్రభాస్ హత్యలు చేస్తాడేమో అని ఆ తల్లి భయపడుతోంది అనడానికి సింబాలిక్ గా ఈ సన్నివేశాన్ని చూపించారు. అందుకే ఆమె ఇంట్లో కనీసం కూరలు కట్ చేయడానికి కూడా చాక్ లేకుండా చూసుకుంటోందని.. అందుకే ఇంట్లో కూరలు చేయలేక గొడ్డు కారం వేసి పెడుతోంది అంటూ ఓ ఎక్స్ప్లనేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. ఏమి ఎలివేషన్స్ ఇచ్చావ్ సామి అంటూ ప్రశాంత్ నీల్ బ్రెయిన్ ను తెగ పొగిడేస్తున్నారు. ఇంత చిన్న ప్లాస్టిక్ కత్తితో అంత ఎలివేషన్ ఇచ్చావ్ అంటే నువ్వు చాలా గ్రేట్ సామి అంటూ కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలలో కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading