Home » Waltair Veerayya : “వాల్తేరు వీరయ్య” ఓటిటి రిలీజ్ డేట్ పిక్స్..స్ట్రీమింగ్ ఎందులో అంటే !

Waltair Veerayya : “వాల్తేరు వీరయ్య” ఓటిటి రిలీజ్ డేట్ పిక్స్..స్ట్రీమింగ్ ఎందులో అంటే !

by Bunty
Ad

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఇటీవల సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. చాలాకాలం తర్వాత చిరంజీవి ఈ చిత్రంతో ఫుల్ మాస్ లుక్ లో కనిపించారు. చిరంజీవితో పాటు ఈ చిత్రంలో శృతిహాసన్, మాస్ మహారాజా రవితేజ, కేతరిన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు.

Advertisement

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. అయితే ఈ చిత్రంలో ఐదు పాటలు ఉండగా, ఆడియన్స్ ని బాగా మెప్పించిన సాంగ్ మాత్రం ‘బాస్ పార్టీ’. ఇదిలా ఉండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో గుడ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. వాల్తేరు వీరయ్య సినిమాను థియేటర్స్ లో చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూడటానికి వెయిట్ చేస్తున్నారు.

Advertisement

అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పేస్తూ వాల్తేరు వీరయ్య సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ప్రముఖ నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 27న వాల్తేరు వీరయ్య నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ప్లస్ అయింది. ఇక చిరంజీవి ఎనర్జిటిక్ ఫైట్స్, డాన్సులు ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి.

read also : దర్శకుడు వెంటపడినా.. బ్లాక్ బస్టర్ సినిమా ‘బాషా’ కు బాలయ్య ఎందుకు నో చెప్పారో తెలుసా!

Visitors Are Also Reading