పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియనివారు ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆగ్ర హీరోలు అందరిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. సినిమాలలో నటిస్తూనే రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పార్టీని స్థాపించారు. తన నటనతో, మాటలతో కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది అనే విషయాలు ఎవరికీ తెలియదు. దాని గురించి ఎప్పుడూ తెలుసుకుందాం…
Advertisement
ఇండస్ట్రీలోకి రాకముందు పవన్ కళ్యాణ్ అసలు పేరు కల్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ ‘అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఆ తర్వాత రెండవ సినిమాగా ‘గోకులంలో సీత’ సినిమాలో నటించారు. ఈ సినిమాల్లో తన నటనకు గాను ఎంతో మంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ రెండు చిత్రాలకు పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమా విడుదల సందర్భంగా విలేకరుల సమక్షంలో పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ అని అనడం జరిగింది.
Advertisement
ఆ తర్వాత చాలా పత్రికల్లో పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ అని బిరుదుతో కథనాలు వచ్చాయి. అప్పటినుంచి కళ్యాణ్ బాబు పేరు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని రాయడం జరిగింది. ఆ తర్వాత నటించినటువంటి సుస్వాగతం సినిమా బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని రాయడం జరిగింది. అప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు వైరల్ గా మారింది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Balayya : గ్లోబల్ లయన్ గా వచ్చేసిన బాలయ్య
శ్రీ రెడ్డిని దారుణంగా మోసం చేసిన తేజ ?
2018 : ఓటిటిలోకి వచ్చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘2018’