Home » Poorna : పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ… ఫోటోలు వైరల్

Poorna : పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ… ఫోటోలు వైరల్

by Bunty
Ad

సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు పూర్ణ. మొదట్లో వరుస అవకాశాలను అందుకొని హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ, తర్వాత సినిమాలలో ఆఫర్లు తగ్గినప్పుడు బుల్లితెరపై టీవీ షోలు చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది.

read also : పెళ్లికి ముందే ప్రియుడుతో కలిసి తిరుమలలో దర్శనం ఇచ్చిన జాన్వి

Advertisement

 

ఇది ఇలా ఉండగా, ఈ యాక్ట్రెస్ గత ఏడాది అక్టోబర్ లో సీక్రెట్ వివాహం చేసుకుంది. కేరళకు చెందిన షనిద్ ఆసిఫ్ ఆలీని పూర్ణ పెళ్లాడింది. ఇతను దుబాయ్ లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరును సంపాదించుకున్నాడు. ఇక పెళ్లి విషయాన్ని అభిమానులకు కొన్ని రోజుల తర్వాత తెలియజేసిన పూర్ణ పెళ్లి అయిన రెండు నెలలకే డిసెంబర్ లో తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించడం విశేషం.

Advertisement

Poorna: అవును.. తల్లయింది! | Poorna Blessed with baby boy avm

ఇక అప్పటినుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చి దుబాయ్ లోనే ఉంటున్న పూర్ణ అక్కడే ఘనంగా సీమంతం కూడా చేసుకుంది. తాజాగా నేడు మగ బిడ్డకు జన్మనిచ్చింది. దుబాయ్ హాస్పిటల్ లో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అక్కడ డాక్టర్స్ తో ఫోటో దిగి తన సోషల్ మీడియా ద్వారా ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది పూర్ణ. ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

READ ALSO : Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్

Visitors Are Also Reading