Home » నేను తెలంగాణ బిడ్డనే… వెలివేయకండి – పూనమ్ కౌర్

నేను తెలంగాణ బిడ్డనే… వెలివేయకండి – పూనమ్ కౌర్

by Bunty
Ad

పూనమ్ కౌర్ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు చేయకపోయినా తన అందం, అభినయంతో పూనమ్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన పూనమ్ అనేక వివాదాలు సమస్యల వల్ల సినిమాల నుండి దూరమైంది. సినిమాల నుండి దూరమైనప్పటికీ పూనమ్ సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

read also : 12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్

Advertisement

అయితే తాజాగా సినీ పరిశ్రమలో తనని పంజాబీ అమ్మాయిలని వెలివేస్తున్నారని సినీ నటి పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై పూనమ్ కౌర్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తాను తెలంగాణలో పుట్టిన బిడ్డనని, ఇక్కడే పెరిగానంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇక పూనమ్ కౌర్ తెలంగాణపై చేసిన సెన్సేషనల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

read also : “బలగం” వివాదంపై జబర్దస్త్ వేణు క్లారిటీ.. అసలు కథ ఎవరిదంటే ?

అయితే ఆమెను మతం, మైనారి అమ్మాయి అనే పేరుతో ఎవరు దూరం పెడుతున్నారనే విషయంపై మాత్రం ఆమె ఆ వీడియోలో బహిరంగపరచలేదు. గవర్నర్ ఉండే రాజ్ భవన్ లో ఓ హీరోయిన్ అంత బహిరంగంగా ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకొని అలా మాట్లాడడం నిజంగా ఆలోచించదగ్గ పరిణామమే. కాగా ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళసైతో పాటు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ, ఐఏఎస్ అధికారిని శైలజ రామయ్య తదితరులు పాల్గొన్నారు.

read also : Ravanasura : రావణాసుర టీజర్ రిలీజ్… అరివీర భయంకరంగా రవితేజ

Visitors Are Also Reading