Home » కాశీకి మోడీ పంపిన కానుక ఏమిటో తెలుసా..?

కాశీకి మోడీ పంపిన కానుక ఏమిటో తెలుసా..?

by Anji
Ad

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ త‌న క‌ల‌ల ప్రాజెక్ట్ అయిన కాశీ విశ్వ‌నాథ్ కారిడార్‌ను గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో ప్రారంభించారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాని యూపీలోని కాశీ నుంచి పార్ల‌మెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. కాశీ పుణ్య‌క్షేత్రం సుప్ర‌సిద్ధ‌మైంది కావ‌డంతో కాశీ విశ్వ‌నాథ్ కారిడార్‌ను నిర్మించారు. తాజాగా ఆయ‌న కాశీవాసుల‌కు ఓ కానుక‌ను కూడా పంపించారు. ఆ కానుక ఏమిటో తెలిస్తే ఆశ‌ర్య‌పోతారు.

Also Read: కుక్క పుట్టిన రోజుకు 7లక్షలు…యజమానిని బొక్కలో వేసిన పోలీసులు…!

Advertisement

PM Modi inaugurates Kashi Vishwanath Dham in Varanasi | PM modi| Kashi vishwanath temple

దేశంలోని 12 బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు 2021లో ఓ రోజు అర్థరాత్రి స‌మ‌యంలో కాశీ రైల్వేస్టేష‌న్ అంత‌టా క‌లియ‌దిరిగారు. స్థానికుల‌తో ముచ్చ‌టించారు. విశ్వ‌నాథ్ కారిడార్ ప్రారంభించిన త‌రువాత అక్క‌డ ప‌ని చేసిన కార్మికుల‌తో చాలా సేపు గ‌డిపారు. క‌ష్ట‌సుఖాల‌ను అడిగి తెలుసుకున్నారు. వారితో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం కూడా చేసారు. మ‌హానుభావులు, సాధువులు తిరుగాడిన నేల‌లో తాను ప‌ర్య‌టించ‌డం త‌న పూర్వ జ‌న్మ సుకృతం అన్నారు. భావి భార‌త పౌరుల‌ను తీర్చిద్దేది విద్య మాత్ర‌మేనని ముఖ్యంగా బాలిక విద్య ఆవ‌స్య‌క‌త గురించి చెప్పుకొచ్చారు.

Advertisement

How Narendra Modi's Kashi movement will help India unshackle itself from Left-liberal wokeism

కాశీ యాత్ర ముగించుకుని వ‌చ్చిన త‌రువాత పరిపాల‌నా ప‌ర‌మైన ప‌నుల్లో చాలా బిజీగా గ‌డిపారు. మ‌ధ్య మ‌ధ్య‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో పాటు ఉత్త‌రాది రాష్ట్రాల‌లో జ‌రుగ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో గ‌డిపారు. కాశీ విశ్వ‌నాథ్ కారిడార్ ప‌నుల్లో భాగ‌స్వాములు అయిన వారికి ఆయ‌న ఒక కానుక‌గా ఇవ్వాల‌ని ఆనాడు భావించారు. ప్ర‌ధాని తాజాగా కారిడార్ పనుల్లో పాల్గొన్న వారికి దాదాపు 100 మంది వ‌ర‌కు జూట్‌తో త‌యారు చేసిన పాద‌ర‌క్ష‌ల‌ను పంపించారు.

Also Read: ర‌జినీకాంత్ మొద‌టి సినిమా! తాగుబోతు వేషం… 1000 రెమ్యున‌రేష‌న్!

Visitors Are Also Reading