ప్రస్తుత కాలంలో ఏ పని చేయాలన్నా చాలా వరకు కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ లేకుండా కనీసం చిన్న పని కూడా జరిగే పరిస్థితి లేదు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మరీ దారుణం గంటలకొద్దీ, డే అండ్ నైట్ షిఫ్ట్ ల కొద్ది కంప్యూటర్ ముందు కూర్చొని పనులు చేస్తూ ఉంటారు. అలా చేస్తూ చేస్తూ ఒక బొమ్మలా తయారవుతారు.. అలా కంప్యూటర్ ముందు చేసేవారు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి..?
గంటల కొలది కంప్యూటర్లముందు మీరు పని చేస్తున్నట్లయితే సాధారణంగా అలసటకు గురవుతారు. కళ్ళు కూడా పొడిబారిపోతాయి. ఈ సమయంలో కళ్ళకు కాస్త రెస్ట్ ఇవ్వాలి. దీనికోసం ఐ వర్కౌట్ సాధన చేయాలి. ఈ వ్యాయామం ఎలా చేయాలంటే..? కనుగుడ్లను పైకి లేపి మూడు సెకన్ల పాటుగా అలాగే ఉంచి, మెల్లగా కిందకు దింపాలి. తర్వాత మూడు సెకండ్లు పూర్తిగా కిందికి దింపి ఉంచాలి. ఈ విధంగా మూడు సార్లు చేస్తే బాగుంటుంది. కనుగుడ్లను మూడు సెకన్ల పాటు కుడివైపుకు, మరో మూడు సెకన్ల పాటు ఎడమవైపుకు తిప్పుతూ ఉండాలి.
Advertisement
Advertisement
ఈ విధంగా మూడుసార్లు చేయాలి. దీని తర్వాత పైకి లేపి ఎడమ వైపు తిప్పాలి, అలా మూడు సెకన్లు ఉన్న తర్వాత మళ్లీ పైకి లేపి కుడి వైపు తిప్పాలి.. ఇలా మూడు సార్లు చేసి కను గుడ్లను గుండ్రంగా తిప్పాలి. ఇలా చేసిన తర్వాత రెండు కళ్ళను మూసుకొని పది సెకన్ల పాటు అలాగే ఉండాలి తర్వాత కళ్ళు తెరిచి, వాటిని పెద్దవిగా చేసి పది సెకన్ల పాటు అలాగే ఉంచాలి. తర్వాత కళ్లను వేగంగా ఆర్పేసి రిలాక్స్ అవ్వాలి. ఇలా చేస్తే మీ కళ్ళు రిలాక్స్ అవ్వడం ఏ కాకుండా, ఎక్కువగా ఒత్తిడికి గురి కావు.
ALSO READ;
పుచ్చకాయలో ఏది మంచిదో.. ఏది చెడ్డదో ఇలా గుర్తించండి..!
Bigg Boss OTT Telugu: వారి వల్లనే బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చానన్న సరయూ