Home » Bigg Boss OTT Telugu: వారి వ‌ల్ల‌నే బిగ్‌బాస్ నుంచి బ‌య‌టికొచ్చాన‌న్న స‌ర‌యూ

Bigg Boss OTT Telugu: వారి వ‌ల్ల‌నే బిగ్‌బాస్ నుంచి బ‌య‌టికొచ్చాన‌న్న స‌ర‌యూ

by Anji
Ad

బిగ్‌బాస్ షోతో పాపులారిటీ ద‌క్కించుకున్న వారిలో స‌ర‌యు ఒక‌ర‌నే చెప్పొచ్చు. ముఖ్యంగా యూట్యూబ్ ఛాన‌ల్ లో 7 ఆర్ట్స్‌కు సంబందించిన‌ వీడియోలు స‌ర‌యు వ‌దులుతుంటుంది. అందులో డ‌బు మీనింగ్‌లేమి లేవు. అంతా డైరెక్ట్ అనే విధంగా సంభాష‌ణ ఉంటుంది. ప‌లు వివాదాల‌తో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు పీఆర్ వ్య‌వ‌స్థ‌పై మండిప‌డింది. కేవ‌లం పీఆర్ టీమ్ వ‌ల్ల తాను బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసానంటూ.. వాళ్ల గుట్టు బ‌య‌ట‌పెట్టింది. వాస్త‌వం చెబితే.. అంద‌రికీ కోపాలు వచ్చేస్తాయి. వేరే వాళ్ల‌ను మైన‌స్ చేసే పీఆర్ ఎవ‌రికైతే ఉంటుందో వాళ్లు బిగ్ బాస్ ఆట‌లో ముందుంటారట‌.


ముఖ్యంగా బిగ్ బాస్ షో మ‌న‌కు చూపించేది కేవ‌లం గంటసేపు మాత్ర‌మే. దానిని బ‌ట్టి నెగెటివ్ గా వెళ్తున్నారా..? లేదంటే పాజిటివ్‌గా వెళ్తున్నారా..? అన్న‌ది ఎలా తెలుస్తుందంటే.. బ‌య‌ట ఉన్న పీఆర్ఓలు అంద‌రూ బీభ‌త్స‌మైన ప్ర‌చారం చేస్తారు. వారు స‌పోర్ట్ చేసే కంటెస్టెంట్ కు వ్య‌తిరేకంగా ఉన్న వాళ్ల‌ను నెగిటివ్ చేస్తారు. పీఆర్ పని అదే.. ఇంత‌కు ముందు బిగ్ బాస్‌లో ఇలా ఉండేది కాదు. ఈ మ‌ధ్య‌నే అలా అవుతుంది. బిగ్‌బాస్‌కు వెళ్లే ముందు పీఆర్ఓల‌ను పెట్టుకోవ‌డం.. వాళ్ల‌తో నెగిటివ్ ప‌బ్లిసిటీ చేయించ‌డం చేస్తున్నారు. పాజిటివ్ అవ్వ‌క‌పోయినా ప‌రవాలేదు. కానీ ఎదుటి వాళ్ల‌ను నెగిటివ్ చేయాల‌ని మాత్రం చూస్తారు. నేను కూడా బాధితురాలినే పీఆర్ టీమ్ వ‌ల్లనే రెండు సార్లు ఎలిమినేట్ బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని చెప్పుకొచ్చింది.

Advertisement

Advertisement

టాలీవుడ్‌లో పాపుల‌ర్ పీఆర్ఓ ఏలూరు శ్రీ‌ను నాకు స‌పోర్ట్ చేసారు. కానీ నేను ఎందుకు విన్ కాలేదు అని స్ర‌వంతి ప్ర‌శ్నించ‌డంతో స‌రయు కౌంట‌ర్ ఇచ్చింది. అంటే.. పీఆర్ టీమ్‌లో ఫేక్ ప‌బ్లిసిటీ, నెగిటివిటీ చేయ‌డం లేద‌ని అంటావా..? అని అడిగింది. దీంతో స్ర‌వంతి నెగిటివిటీ ఉంది. కానీ పీఆర్ టీమ్‌ల‌తోనే ముందుకు వెళ్తున్నారంటే క‌రెక్ట్ కాదు. అలా అనుకుంటే నేను విన్న‌ర‌వ్వాలి క‌దా అంది. దానికి స‌ర‌యు స్పందిస్తూ.. ఏలూరు శ్రీ‌నుతో నేను ప‌ని చేశాను. ఆయ‌న నిన్ను ఎలా ముందుకు తీసుకొని వెళ్లాలా అని అనుకున్నారు త‌ప్ప వేరే వాళ్ల‌ను బ్యాడ్ చేయాల‌ని అనుకోలేదు. నా విష‌యంలోనే ఏమైంది. న‌న్ను అరియానా బాడీ షేమింగ్ చేసిందని.. నేను ఏడిచితే న‌న్ను బ్యాడ్ చేసి.. బ‌య‌ట‌కు పంపార‌ని త‌న బాధ చెప్పుకొచ్చింది స‌ర‌యు.

Also Read : 

Mothers Day : త‌ల్లికి ప్రేమ‌తో శుభాకాంక్ష‌లు చెప్పిన సితార‌

గాడిద ఎప్పుడు గాడిదే.. చార‌లు గీచినంత మాత్రాన జీబ్రాకాద‌ని ఇమ్రాన్ ఎందుకు అన్నారో తెలుసా..

Visitors Are Also Reading