Home » ఐపీఎల్ ఫైనల్స్ కు పాక్ చైర్మన్ కు ఆహ్వానం.. నిజామా…?

ఐపీఎల్ ఫైనల్స్ కు పాక్ చైర్మన్ కు ఆహ్వానం.. నిజామా…?

by Azhar
Ad
ఐపీఎల్… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండో క్రికెట్ లీగ్. ఇది ఈ మధ్యే బీసీసీఐ అమ్మిన మీడియా రైట్స్ ద్వారా ప్రజలందరికీ తెలిసింది. అయితే ఈ విషయం పై అన్ని దేశాల క్రికెట్ అభిమానులు ఆనదంగా ఉంటె.. కేవలం పాకిస్థాన్ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంది. అయితే ఐపీఎల్ ను ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా విస్తరించాలని బీసీసీఐ భావిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఐపీఎల్ లో మ్యాచ్ లు పెంచుతాం అని బీసీసీఐ అధికారి జే షా కూడా పేర్కొన్నారు. ఇక దీని పై పాకిస్త క్రికెట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
ఎందుకంటే… ఐపీఎల్ లో ఆడటానికి పాకిస్థాన్ ఆటగాళ్లకు అనుమతి లేదు. ఇక మిగితా దేశాల ఆటగాళ్లు అందరూ ఐపీఎల్ లో ఆడుతున్న సమయంలో పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటానికి ఎవరు రావడం లేదు. అందువల్ల ఐపీఎల్ జరిగినంత కాలం పాక్ ఆటగాళ్లు ఖాళీగా ఉండాలి వస్తుంది. అందువల్ల ఇప్పటికే రెండు నెలలు ఉన్న ఈ ఐపీఎల్ ను మూడు నెలలకు పెంచాలని బీసీసీఐ భావిస్తుంది. ఈ విషయం పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా తాజాగా స్పందించాడు.
ఇప్పటివరకు అయితే ఐపీఎల్ ను పెంచనున్నట్లు వార్త అధికారికంగా బీసీసీఐ నుండి మాత్రం రాలేదు. ఒకవేళ ఈ నిర్ణయం అధికారికంగా వెలువడితే మేము దీని పై ఐసీసీ చర్చలో మాట్లాడుతాం. ఇలా చేయడం ద్వారా పాకిస్థాన్ తో పాటుగా మిగితా దేశాలు కూడా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడకుండా నష్టపోతుంటాయి. కాబట్టి అలా జరగకుండా చూసుకుంటాం అని చెప్పాడు. అదే విధంగా గత రెండు ఐపీఎల్ సీజన్ ల ఫైనల్స్ సమయంలో మ్యాచ్ చూడటానికి రావాలని బీసీసీఐ ప్రసిడెంట్ గంగూలీ తనకు సందేశం పంపినట్లు చెప్పారు. కానీ పరిస్థితులు అనుమతించక.. మేము అలా చేయలేకపోయాము అని రమీజ్ రాజ్ తెలిపారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. నిజంగా గంగూలీ ఆహ్వానం పంపాడా.. లేక రమీజ్ అలా బీరాలు పలుకుతున్నాడా అనేది దాదా స్పందిస్తేనే తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading