Home » తమ బోర్డుపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాకిస్థాన్ యువ బౌలర్…!

తమ బోర్డుపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాకిస్థాన్ యువ బౌలర్…!

by Azhar
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ యువ బౌలర్ నసీం షా షాకింగ్ కామెంట్స్ చేసాడు. తమకు సరైన వసతులు కూడా కల్పించడం లేదు అని చెప్పాడు. అయితే ఎప్పుడు పాకిస్థాన్ బోర్డు గాని.. అక్కడి మాజీ ఆటగాళ్లు కానీ ఇండియా గురించి బీసీసీఐ గురించే ఆలోచిస్తూ ఉంటారు. బీసీసీఐ పైన ఏ విధంగా విమర్శలు చేద్దామా అనే చూస్తారు. ఈ మధ్య మన బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ హక్కులు అమ్ముడుపోయిన ధరను చూసిన అక్కడి మాజీ ఆటగాళ్లు.. ఐపీఎల్ అంటే క్రికెట్ కాదు… బిజినెస్ అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు.
ఇక ఎప్పుడు పక్కవారి గురించి ఆలోచించే ఆదేశ బోర్డు.. ఆటగాళ్లు తమ ఆటగాళ్లకు మాత్రం నచ్చి వసతులను కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఈ విషయాన్ని వాళ్ళలాగా ఏ పక్క దేశ ఆటగాడో చెప్పడం లేదు. పాకిస్థాన్ కు చెందిన యువ పేసర్ నసీం షా తెలిపాడు. 19 ఏళ్ళ ఈ పాక్ బౌలర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని కౌంటీ క్రికెట్ లో ఆడుతున్నాడు. అయితే అక్కడ తాజాగా నసీం షా మాట్లాడుతూ.. ఇక్కడ కౌంటీ ఆడే ఆటగాళ్లకు ఉన్న వసతులను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. కనీసం ఇందులో సగం కూడా మాకు అక్కడ పాకిస్థాన్ లో దక్కడం లేదు అని అన్నాడు. నసీం షా పాకిస్థాన్ లోని ఓ మారుమూల గీతామానికి చెందినవాడు.
అయితే పాక్ లో లాహోర్, కరాచీలలో మినహా మిగితా ఎక్కడ కూడా క్రికెట్ కు వసతులు సరిగ్గా ఉండవు. నేను చిన్నపుడు టేప్ బాల్ తో ప్రాక్టీస్ చేసేవాడిని అని చెప్పాడు. నాకు ప్రాక్టీస్ చేయడనికి గ్రౌండ్ కూడా ఉండేది కాదు. ఇక్కడితో పోలిస్తే మాకు ఉండేవి అసలు వసతులు కాదు. అయిన కూడా అలంటి పరిస్థితుల్లో నుండి చాలా మంది మంచి ఆటగాళ్లు వచ్చారు. అదే అక్కడ ఇంకా వసతులు బాగుంటే చాలా మంచి ఆటగాళ్లు వెలుగులోకి వస్తారు అని నసీం షా పేర్కొన్నాడు. ఇక ఈ కామెంట్స్ పై భారత అభిమానులు స్పందిస్తూ.. ఇప్పటికైనా పక్కవాళ్ళ మీద పడి ఏడవకుండా ముందు మీ ఆటగాళ్లకు సరైన వసతులు కల్పించడండి అని కామెంట్స్ చేస్తున్నారు.
Visitors Are Also Reading