కేంద్ర ప్రభుత్వం తో ఒక రోజు సిఎం జగన్ ను ఆట ఆడిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవాళ విశాఖలో మూడో విడత వారాహి యాత్ర ప్రారంభించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా సిఎం జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పవన్. కేంద్ర ప్రభుత్వం తో ఒక రోజు సిఎం జగన్ ను ఆట ఆడిస్తాను.. సమీప భవిషత్తు లో అన్ని బయటకు వస్తాయని హెచ్చరించారు. ఆంధ్ర యూనివర్సిటీ వైసీపీ కార్యాలయము గా మార్చారని ఫైర్ అయ్యారు.
Advertisement
ఏయూ లో వైసీపీ నాయకులు పుట్టిన రోజులు చేస్తారు…గంజాయి అమ్ముతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. 2019లో ర్యాంకింగ్స్ లో ఏయూ 29 వ స్థానంలో ఉంటే 76 వ స్థానానికి పడిపోయిందని మండిపడ్డారు. ఏయూ వీసి పై కేంద్రాని కి పిర్యాదు చేస్తాను, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీసి వైసీపీ తరపున ఓట్లు అడుగుతాడని అగ్రహించారు పవన్ కళ్యాణ్. ఏయూను ప్రక్షాళన చేస్తాము, జగన్ భ్రష్టు పట్టిస్తున్నాడని మండిపడ్డారు. వైజాగ్ ల్యాండ్ స్కామ్ లు మేము బయటకు తీస్తామని హెచ్చరించారు. కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంది…మీరు రెడీ గా ఉండండి మేము పోరాటాలు కి సిద్ధం గా ఉన్నామని పేర్కొన్నారు.
Advertisement
ఎమ్మెల్యేలు వందలు కోట్లు స్కామ్ లు బయటకు తీసుకు వచ్చి..దోషులు గా నిలబెడతామని హెచ్చరించారు. 60 రూపాయలు ఉండే క్వాటర్ మందు 160 చేసాడు.. నాకు చాలా బాధ గా ఉందన్నారు. ఇక్కడ ఉండే మంత్రి డీఎస్సీ పూర్తి చేస్తాము అంటాడు.. ఖాళీలు అలాగే ఉన్నాయని అగ్రహించారు. ఉద్యోగులుకు జీతాలు ఇవ్వరు …బైజుస్ కి 500 కోట్లు ఇచ్చారు.. విశాఖ లో ప్రభుత్వ ఆస్తులు 25 వేలు కోట్లు కి తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. డబ్బు అంటే జగన్ కు పిచ్చి అయిపోయింది.. ఇన్ని వేల కోట్లు ఏమి చేసుకుంటావు అని మండిపడ్డారు. జగన్ కు మరొక అవకాశం ఇస్తారా ? అని ఆలోచించుకోండని కోరారు.
ఇవి కూడా చదవండి :
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించిన అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్…!
Vishal : స్టార్ హీరోతో లక్ష్మీ మీనన్ పెళ్లి…!