Home » పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బిగ్ షాక్.. ఆ సినిమా రీమేక్ గా ‘ఓజి’?

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బిగ్ షాక్.. ఆ సినిమా రీమేక్ గా ‘ఓజి’?

by Bunty
Published: Last Updated on
Ad

సాహో డైరెక్టర్ సుజిత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో ఓజి అనే ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా రాబోతున్నాడని ఎప్పుడైతే ప్రకటించారో, అప్పటి నుంచి ఎన్నో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేం. పాటలు, ఫైట్స్ లేవట. పవన్ నెల రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చాడని, రెండు భాగాలుగా రాబోతుంది. హీరోయిన్ కూడా ఉండదని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సడన్ సర్ప్రైజ్ చేస్తూ, ఊహించని విధంగా ఈ ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టేశారు పవన్.

Advertisement

 

ఇది పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. దీంతో నెక్స్ట్ ఓజి సెట్స్ పైకి వెళ్ళడమే లేట్ అంటున్నారు. అయితే ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ తో పాటు హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో పవర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసే ఆ డ్యూటీ ఎవరనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా ఈ ఓజి కథ గురించి ఇప్పటికే చాలా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసింది. ఇది తమిళ రీమేక్ అని, పవన్ కళ్యాణ్ ఇందులో గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడు అని ప్రచారం అయింది. అయితే ఇది ‘ఎంతవాడవు గాని’ సినిమాకు రీమేక్ అంటూ ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది.

Advertisement

అజిత్ హీరోగా నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం తెలుగులో ఎంత వాడవుగాని పేరుతో డబ్ ఆయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మామూలుగా ఆడింది. అయితే స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్ వంటి ఛానల్ లలో ఈ మూవీ చాలాసార్లు టెలికాస్ట్ అయ్యింది. ఇంకో విచిత్రం ఏమిటంటే ఈ చిత్రాన్ని చిరు రీమేక్ చేయాలని ట్రై చేశారు. కానీ స్క్రిప్ట్ సెట్ అవ్వక వదిలేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సుజీత్ రీమేక్ చేయడం ఏంటో, అసలు ఇందులో నిజం ఉందో లేదో తెలియాల్సి ఉంది.

READ ALSO : క్యాన్సర్ బారిన పడిన ఆటో రాంప్రసాద్?

Visitors Are Also Reading