Home » క్యాన్సర్ బారిన పడిన ఆటో రాంప్రసాద్?

క్యాన్సర్ బారిన పడిన ఆటో రాంప్రసాద్?

by Bunty
Ad

జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని సెలబ్రిటీలు అయిపోయిన వారి లిస్ట్ పెద్దదే. అయితే ఇందులో స్టార్స్ గురించి చెప్పుకోవాలి అంటే సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ల గురించి చెప్పుకోవాలి. వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ప్రేక్షకులు వీళ్ళ స్కిట్ లు చూసి విపరీతంగా నవ్వుకుంటూ ఉంటారు. ఈ ముగ్గురు చేసే స్కిట్లు అంత బాగా పండడానికి ముఖ్య కారణం వీళ్ళు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అని కూడా చెప్పొచ్చు.

Advertisement

ఇదిలా ఉండగా, ఇటీవల తలపై ఒక క్యాప్ పెట్టుకొని కనిపించడంతో ఆటో రాంప్రసాద్ కు క్యాన్సర్ ఉందని, ఆయన అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆటో రాంప్రసాద్. జబర్దస్త్ కమెడియన్ ఆర్ పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెండో బ్రాంచ్ ను తాజాగా మణికొండలో ఏర్పాటు చేయగా,

Advertisement

బ్రాంచ్ ఓపెనింగ్ కి జబర్దస్త్ కమెడియన్స్ చాలామంది వచ్చారు. వారిలో రాంప్రసాద్ కూడా ఒకరు. ఈ క్రమంలోనే రాంప్రసాద్ మాట్లాడుతూ, నా ఆరోగ్యం బాగా లేదంటూ, నాకు క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తలు ఏమాత్రం నిజం లేదు, నేను హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాను. ఆ కారణంగానే తలపై క్యాప్ పెట్టుకున్నాను అంటూ రాంప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.

READ ALSO : Ram Charan : విజయ్ ‘లియో’లో మెగా హీరో రామ్ చరణ్… ఇదిగో ఇదే సాక్ష్యం!

Visitors Are Also Reading