Home » ప‌వ‌ర్ స్టార్ స‌తీమ‌ణి అన్నా లెజెనోవా ఆస్తుల విలువ అన్ని కోట్లా ?

ప‌వ‌ర్ స్టార్ స‌తీమ‌ణి అన్నా లెజెనోవా ఆస్తుల విలువ అన్ని కోట్లా ?

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ వ‌ప‌న్ క‌ల్యాణ్ ర‌ష్యా దేశ‌స్థురాలు అన్నా లెజెనోవాను ప్రేమ‌వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తీన్మార్ సినిమాలో అన్నా లెజెనోవా న‌టించారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డారు.

cropped-02-6.jpg

Advertisement

ఈ క్ర‌మంలోనే రేణూ దేశాయ్ తో విడాకులు తీసుకున్నారు. అనంత‌రం అన్నాలెజెనోవాను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉండ‌గా లెజెనోవా ప్ర‌ముఖ రష్య‌న్ మోడ‌ల్ మ‌రియు న‌టి కాగా అనేక తెలుగు సినిమాల‌లో కూడా న‌టించారు.

అన్నా లెజెనోవా1980 సంవ‌త్స‌రం ఆగ‌స్టు 3న జ‌న్మించారు. ఇక ఎక‌నామిక్ టైమ్స్ ప్ర‌కారం అన్నా లెజెనోవా ఆస్తుల విలువ 1800 కోట్లుగా ఉంది. అంతే కాకుండా అన్నా లెజెనోవా క్రిస్టియ‌న్ మ‌తానికి చెందిన‌వారు. మొద‌టిసారిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నాలెజెనోవాల‌కు 2011లో ప‌రిచ‌యం ఏర్పడింది. తీన్మార్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో వీరిద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డ‌గా ఒక‌రితో మ‌రొక‌రు ప్రేమ‌లో ప‌డ్డారు.

Advertisement

త‌ర‌వాత మూడేళ్ల పాటూ వీరిద్ద‌రూ డేటింగ్ లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక 2013లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుని ఒక్క‌ట్ట‌య్యారు. వీరికి ఓ కూతురు మ‌రియు కుమారుడు ఉన్నారు. కూతురు పేరు పొలేనా మ‌రియు కుమారుడు మార్క్ శంక‌ర్ లు ఉన్నారు. ఇక గ‌తంలో అన్నా లెజెనోవా మోడ‌ల్, న‌టి అయిన‌ప్ప‌టికీ ఆమె సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటారు.

అధికారికంగా ఆమెకు అస‌లు సోష‌ల్ మీడియా ఖాతాలు కూడా లేక‌పోవ‌డం విశేషం. మ‌రోవైపు అన్నా లెజొనోవా ప్ర‌స్తుతం ఎక్కువ‌గా ర‌ష్యాలో ఉంటున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అన్నా లెజొనోవా పిల్ల‌లు ఇద్ద‌రినీ సింగ‌పూర్ లో చ‌దివించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నట్టు వార్త‌లు వినిపించాయి.

ALSO READ :

Gruhalakshmi : అమ్మ‌, నాన్న ఇద్ద‌రిలో ఎవ‌రు కావాలో చెప్పేసిన దివ్య‌..!

ఎన్టీఆర్ కొండ‌వీటి సింహంలో చిరును త‌ప్పించి మోహ‌న్ బాబుకు ఛాన్స్…తెర‌వెన‌క క‌థ ఇదే..!

 

Visitors Are Also Reading