Home » ఎన్టీఆర్ కొండ‌వీటి సింహంలో చిరును త‌ప్పించి మోహ‌న్ బాబుకు ఛాన్స్…తెర‌వెన‌క క‌థ ఇదే..!

ఎన్టీఆర్ కొండ‌వీటి సింహంలో చిరును త‌ప్పించి మోహ‌న్ బాబుకు ఛాన్స్…తెర‌వెన‌క క‌థ ఇదే..!

by AJAY
Ad

టాలీవుడ్ చరిత్రలో చిరంజీవి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక జనరేషన్ మొత్తం లో ఆయనే స్టార్ హీరోగా కొనసాగారు. దిగ్గజ దర్శకులు అందరితోనూ సినిమాలు చేశారు. అదే విధంగా సార్ హీరోయిన్లు హీరోలతో సైతం మెగాస్టార్ సినిమాలు చేశారు. చిరంజీవి నట ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ ఏఎన్నార్ తో కూడా చిరంజీవి సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావుతో చిరంజీవి మెకానిక్ అల్లుడు అనే సినిమాలో నటించారు.

Advertisement

 

అంతేకాకుండా ఎన్టీ రామారావుతో తిరుగులేని మనిషి సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు మెగాస్టార్ బావమరిది పాత్రలో నటించి అలరించారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో మరో సినిమా చేసే అవకాశం కూడా చిరంజీవికి వచ్చింది. కానీ 5 రోజుల షూటింగ్ తర్వాత చిరంజీవి స్థానంలో మోహన్ బాబును తీసుకున్నారు. ఆ సినిమా ఏంటి మెగాస్టార్ ను ఎందుకు తీసేసారు..? అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కొండవీటి సింహం సినిమా సూపర్ హిట్ అయింది.

Advertisement

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొడుకు పాత్ర కోసం మొదట చిరంజీవిని తీసుకున్నారు. అయితే సినిమాలో ఎన్టీఆర్ కొడుకు గా నటించిన చిరంజీవి ఆయనను విభేదిస్తూ పవర్ ఫుల్ డైలాగులు చెప్పాల్సి ఉంటుంది. చిరంజీవి కూడా పాత్రకు ఒప్పుకున్నారు. షూటింగ్ ప్రారంభమయింది. ఐదు రోజుల పాటు షూటింగ్ జరిపారు. అయితే ఎన్టీఆర్ ను ఎదిరిస్తూ డైలాగులు చెప్పేందుకు చిరంజీవి తడబడ్డారు.

దానికి కారణం ఎన్టీఆర్ అప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరో గా ఉన్నారు. కానీ చిరంజీవి అప్పుడప్పుడే కెరీర్ ను గాడిలో పెట్టుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కేవలం 30 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు. దాంతో షూటింగ్ ఇలాగే జరిగితే కష్టమని మేకర్స్ భావించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి స్థానంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు ను తీసుకున్నారు. అలా మోహన్ బాబు ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో మోహన్ బాబు ఎన్టీఆర్ తో పోటీగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ALSO READ :

దాని వల్ల ఆరేళ్ల పాటు బాధపడ్డా…నెటిజన్లతో సమంత ఎమోషనల్ కామెంట్స్…!

Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading