Home » వంద రూపాయ‌ల నోటుపై నేతాజీ ఫోటో ముద్రించాలి : ప‌వ‌న్ క‌ల్యాణ్

వంద రూపాయ‌ల నోటుపై నేతాజీ ఫోటో ముద్రించాలి : ప‌వ‌న్ క‌ల్యాణ్

by Anji
Ad

వంద రూపాయ‌ల నోటుపై స్వాతంత్య్ర స‌మ‌ర యోధులు నేతాజీ సుభాష్ చంద్ర‌బోష్ బొమ్మ వేయాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. ఆయ‌న‌ను గౌర‌వించుకోక‌పోతే మ‌నం భార‌తీయుల‌మే కాద‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ లెర్నింగ్ సెంట‌ర్ ఫ‌ర్ హ్యుమ‌న్ ఎక్స్‌లెన్స్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ శిల్ప క‌ళావేదిక‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ప‌వన్ పాల్గొని ప్ర‌సంగించారు. ప‌వ‌న్‌తో పాటు డాక్ట‌ర్ ప‌ద్మ‌జారెడ్డి, ఎం.వీ.ఆర్ శాస్త్రి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

Also Read :  ఏపీలో సంక్షేమ ప‌థ‌కాల క్యాలెండ‌ర్‌ విడుద‌ల‌

Advertisement

ఎంవీఆర్ శాస్త్రీ ర‌చించిన నేతాజీ గ్రంథ స‌మీక్ష‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంవీఆర్ శాస్త్రీని మూడు సార్లు మాత్ర‌మే క‌లిసిన‌ట్టు చెప్పారు. ఆయ‌న దాదాపు 20 పుస్త‌కాలు ర‌చించారు. నేను సినిమా ఉచితంగా చూస్తానేమో కానీ పుస్త‌కాల‌ను మాత్రం ఇవ్వ‌న‌ని చెప్పారు. అనంత ప‌ద్మ‌నాభ స్వామి నేలిమాళిగ‌ల్లో ఉన్న సంప‌ద కంటే గ్రంథాల‌యంలో ఉన్న పుస్తకాలే ఎక్కువ విలువైన‌న్ని ప‌వ‌న్ చెప్పారు. ఇక త‌న వ‌ద్ద‌కు త్రివిక్ర‌మ్ వ‌స్తున్నాడంటే పుస్త‌కాల‌ను దాచేస్తాను అని ప‌వ‌న్ తెలిపారు.

Advertisement

నేతాజీ సుభాష్ చంద్ర‌బోష్ గురించి మాట్లాడారు. జైహింద్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్య‌క్తి సుభాష్ చంద్ర‌బోష్ అని.. వంద రూపాయ‌ల నోటుపై ఆయ‌న బొమ్మ వేయాల‌న్నారు. ఆయ‌నను గౌర‌వించుకోక‌పోతే మ‌నం భార‌తీయుల‌మే కాద‌ని ప‌వ‌న్ చెప్పారు. ఈ దేశం నాద‌నుకునే నాయ‌కుడు ఒక్క‌డూ లేడు. ఎంతో మంది బలిదానాల వ‌ల్లే ఈరోజు దేశంలో స్వేచ్ఛ‌గా జీవిస్తున్నార‌ని తెలిపారు. నేతాజీ అస్తిక‌లు రెండోజీ ఆల‌యంలో దిక్కులేకుండా ఉన్నాయి. ఆయ‌న అస్థిక‌లు తిరిగి తీసుకురావాలి. ఆ అస్థిక‌లు నేతాజీవి అవునా కాదా.. అని ప‌రీక్ష‌లు చేసి తేల్చ‌లేమా..? ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు ప్ర‌య‌త్నించినా కుదర‌లేదు. నేతాజీ అస్థిక‌లు దేశానికి తీసుకురావాల‌ని ప్ర‌జ‌లు కోరుకోవాలని అవ‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ సంద‌ర్భంగా #RenkojitoRedfort, #BringbackNetajiAsh హ్యాష్ ట్యాగ్‌ల‌ను షేర్ చేశారు.

Also Read :  Naatu Naatu Song : నాటు నాటు సాంగ్‌కు స్టెప్స్ ఎక్క‌డి నుంచి తీసుకున్నారంటే..?

Visitors Are Also Reading