Home » వినోద‌య సీత‌మ్ రీమేక్..ప‌వ‌న్ పక్క‌కు జ‌ర‌గ‌డంతో డూప్ తో షూటింగ్..!

వినోద‌య సీత‌మ్ రీమేక్..ప‌వ‌న్ పక్క‌కు జ‌ర‌గ‌డంతో డూప్ తో షూటింగ్..!

by AJAY
Published: Last Updated on
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రీమేక్ సినిమాల్లో ఎక్కువ‌గా న‌టిస్తున్నారు. రీమేక్ సినిమాలు అయితే చిన్న‌చిన్న‌మార్పులు చేసి త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేయొచ్చ‌ని భావిస్తున్నారో ఏమో గానీ ఎక్కువ‌గా రీమేక్ సినిమాల‌కే ప‌వన్ జై కొడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ కల్యాణ్ సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోలుగా ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను వినోద‌య సీత‌మ్ సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కిస్తున్నారు.

ALSO READ : అన్నదమ్ముల వివాదంపై మంచు మనోజ్ ఏమన్నారో తెలుసా ?

Advertisement

ఈ చిత్రానికి ప్ర‌ముఖ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అంతే కాకుండా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాట‌లు అందిస్తున్నారు. ఈ సినిమాను జులై 28 వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా కేతికాశ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తుంది.

Advertisement

కాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో ఒక‌వేళ స‌మ‌యానికి రూపం ఉంటే ఎలా ఉంటుందో అలాంటి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఒరిజిన‌ల్ లో ఆ పాత్ర‌ను స‌ముద్ర‌ఖ‌ని చేశారు. అంతే కాకుండా ఈ చిత్రానికి దేవ‌ర అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉండ‌గా…సినిమా క్లైమాక్స్ మ‌రియు క‌థ‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్ట్ షూటింగ్ పూర్త‌య్యింద‌ని ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ఓ ఫోటోను షేర్ చేసి వెల్ల‌డించారు. దాంతో సినిమా కొన్ని డూప్ అవ‌స‌ర‌మైన సీన్ లు మాత్ర‌మే పెండింగ్ లో ఉన్నాయ‌ని ఆ పార్ట్ కూడా త్వ‌ర‌లోనే పూర్తిచేసే ఆలోచ‌న‌లో స‌ముద్ర‌ఖ‌ని ఉన్నార‌ని స‌మాచారం. ఇక మామా అల్లుల్లు న‌టిస్తున్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

ALSO READ : ఇక్కడ ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును..!

Visitors Are Also Reading