Home » అల్లు అరవింద్ కు ఇంకో కొడుకు ఉన్నాడా.. షాకిచ్చిన శిరీష్!

అల్లు అరవింద్ కు ఇంకో కొడుకు ఉన్నాడా.. షాకిచ్చిన శిరీష్!

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య తనయుడిగా అల్లు అరవింద్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నటుడిగా కాకుండా నిర్మాతగా కెరీర్ ఎంచుకున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్నో సినిమాలను అందిస్తున్నారు. అల్లు అరవింద్ కు అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇద్దరు కుమారులే అని చాలామంది అనుకుంటున్నారు. వాస్తవానికి అల్లు అరవింద్ కు మొత్తం నలుగురు కుమారులు అనే విషయం చాలామందికి తెలియదు. మిగతావారు ఎవరు ఏం చేస్తున్నారు? ఉన్నారా? లేరా అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

అల్లు అరవింద్ కి వాస్తవానికి అల్లు వెంకటేష్ (బాబి) మొదటి అబ్బాయి. వెంకటేష్ తర్వాత రాజేష్ జన్మించాడట. వీరిద్దరి తర్వాత అల్లు అర్జున్ పుట్టాడట. అయిదారేళ్ళ వయసులోనే రాజేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడట. అప్పటికి అల్లు శిరిష్ ఇంకా పుట్టలేదట. అన్న రాజేష్ మరణించిన తర్వాత అల్లు శిరీష్ పుట్టాడట. ఇలా అల్లుఅరవింద్ కి నలుగురు కుమారులు అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో శిరీష్ వెల్లడించారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ అలియాస్ బాబి రీసెంట్ గా వరుణ్ తేజ్ గనీ సినిమాతో నిర్మాతగా మారాడు.

Advertisement

అల్లు బాబీకి కొండంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తనకంటూ సొంత గుర్తింపు ఉండడం కోసం ఐటి రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. గీత ఆర్ట్స్ సినీ నిర్మాణంలో కూడా తెర వెనుక తన పాత్రను సమర్థవంతంగా నడిపించారు. లండన్, ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ మాస్టర్స్ చేసి టెక్నాలజీ ఇంటర్ ప్రీటర్ గా తన కెరీర్ ప్రారంభించారు. జస్ట్ టికెట్స్ పేరుతో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఆన్లైన్ టికెట్లను అమ్మకానికి అంకురార్పణ చేశారు. ప్రస్తుతం జస్ట్ టికెట్స్ కి చైర్మన్ గా కొనసాగుతున్నారు.

READ ALSO : బాలయ్య పాటలో రెచ్చిపోయిన “కల్యాణ్ రామ్”.. ఎన్నో రాత్రులోస్తాయి అంటూ !

Visitors Are Also Reading