Home » చిరు సినిమాకి పవన్ చీఫ్ గెస్ట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే పండగ..!!

చిరు సినిమాకి పవన్ చీఫ్ గెస్ట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే పండగ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. వీరందరికీ మూల కారణం చిరంజీవి అని చెప్పవచ్చు. చిరంజీవి సపోర్టుతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, నాగబాబు మంచి హోదాలో కొనసాగుతున్నారు.. కానీ చిరంజీవి మాత్రం ఆరు పదుల వయసు దాటినా కానీ కుర్ర హీరోలకు దీటుగా ఇంకా సినిమాలు చేస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు. అయితే చిరు మోహన్ రాజా డైరెక్షన్ లో చేస్తున్న మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమా ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయింది.

Advertisement

also read:బాల‌య్య స‌ర‌స‌న క‌నిపిస్తున్న ఈ ఇద్ద‌రూ చిన్నారులు ఇప్పుడు కూడా టాలీవుడ్ స్టార్స్ అనే విష‌యం మీకు తెలుసా..?

Advertisement

దాని రీమేక్ గా ఈ సినిమా వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఒక నాలుగు ప్రాజెక్టుల్లో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. దీనిలో భాగంగానే ముందుగా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్.. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీన్ని పాన్ ఇండియా లెవల్లో తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నం చేస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 5వ తేదీన థియేటర్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే ఈ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. దీని గురించి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే వేదిక వద్ద చూస్తే ఏ అభిమానికైనా ఆనందం ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా వర్ణించక్కర్లేదు. అలాంటి ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడంతో సినిమా పై మరింత హైప్ పెరిగిందని చెప్పవచ్చు. గాడ్ ఫాదర్ సినిమా లో హిందీ లోని సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారట. దీనికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

also read:

Visitors Are Also Reading