Home » జ‌య‌ప్ర‌ద మామ తెలుగు సినిమా లెజెండ్ అనే విష‌యం మీకు తెలుసా..?

జ‌య‌ప్ర‌ద మామ తెలుగు సినిమా లెజెండ్ అనే విష‌యం మీకు తెలుసా..?

by Anji
Ad

సుంద‌ర్ లాల్‌ నెహ‌తా ఈమె పేరు చెప్ప‌గానే శాంతి నివాసం, బందిపోటు, గుడి గంట‌లు, గూడ‌చారి 116, ర‌క్త సంబంధం వంటి సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. సుంద‌ర్ లాల్ నెహ‌తా క‌ల‌క‌త్తాలో బీకాం ప‌ట్టా తీసుకొని ఉద్యోగం కోసం ఈస్టిండియా కంపెనీ అధినేత చ‌మ్రియాను క‌లిశారు. ఉద్యోగం కావాలి అడ‌గ‌డంతో సుంద‌ర్ మాట తీరు న‌చ్చిన చ‌మ్రీయా మ‌ద్రాస్‌లోని అత‌ని చ‌మ్రియా తాకి డిస్ట్రీబ్యూట‌ర్స్ కి మేనేజ‌ర్ గా ఉండాల‌ని కోర‌గా అందుకు ఒప్పుకున్నాడు. ఆ త‌రువాత కాలంలో నెహ‌తా ప‌ని త‌నం న‌చ్చ‌డంతో అతడి డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీలో వాటా కూడా ఇచ్చాడు చ‌మ్రియా.


ఇక ఆ త‌రువాత చ‌మ్రియా ద‌గ్గ‌ర అన్ని మెలుకువ‌లు నేర్చుకుని సొంతంగా డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ పెట్టాల‌ని భావించాడు నెహ‌తా. 1941లో చ‌మ్రియా, నెహ‌తాలు క‌లిసి రాజ‌శ్రీ అనే ఒక డిస్ట్రిబ్యూట‌ర్ సంస్థ‌ని న‌డిపించారు. క‌ల‌క‌త్తాకు చెందిన నెహ‌తా తెలుగు ఇండ‌స్ట్రీతో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. ఆ త‌రువాత అక్కినేని హీరోగా శాంతి నివాసం సినిమా సైతం తీశాడు. కాలం గ‌డిచ‌న త‌రువాత తెలుగు రాష్ట్రాల్లో తొలి సినిమా థియేట‌ర్ ఓన‌ర్ అయిన పోత‌న శ్రీ‌నివాస్‌తో ప‌రిచ‌యం పెంచుకొని వారి భాగ‌స్వామ్యంలో సినిమాలు తీశారు.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  బాల‌య్య స‌ర‌స‌న క‌నిపిస్తున్న ఈ ఇద్ద‌రూ చిన్నారులు ఇప్పుడు కూడా టాలీవుడ్ స్టార్స్ అనే విష‌యం మీకు తెలుసా..?


శ్రీ‌నివాస‌రావు కుమారుడు డూండీ సైతం ఈ చిత్ర నిర్మాణం ప‌ట్ల ఆక‌ర్షితుడ‌య్యాడు. దీంతో కృష్ణ హీరోగా ప‌లు సినిమాలు తీసి నెహ‌తా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో తిరుగులేని ప్రొడ్యూస‌ర్‌గా నిల‌బ‌డ్డాడు. నెహ‌తా కుమారుడు శ్రీ‌కాంత్ నెహ‌తా కూడా శ్రీ‌కాంత్ పిక్చ‌ర్స్ అనే ఓ సంస్థ‌ను స్థాపించి గిరిజా క‌ళ్యాణం, ర‌హ‌స్య గూడ‌చారి, అంద‌డు ఆగ‌డు, ఏజెంట్ గోపి వంటి సినిమాలు తీశాడు. ఈ సినిమాల‌న్నింటిలోనూ జ‌య‌ప్ర‌ద హీరోయిన్. ఆ త‌రువాత కాలంలో జ‌య‌ప్ర‌ద‌నే పెళ్లి చేసుకున్నాడు శ్రీ‌కాంత్‌. అలా జ‌య‌ప్ర‌ద నెహ‌తా ఇంటికి కోడ‌లు అయింది.

ఇది కూడా చ‌ద‌వండి :  జీవిత భాగ‌స్వామి ఎంపిక విష‌యంలో ఈ విష‌యాలు త‌ప్ప‌క గుర్తుంచుకోండి..!

Visitors Are Also Reading