గత కొంతకాలంగా పవిత్ర లోకేష్ నరేష్ వ్యవహారంపై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇటీవల వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వీరి టాపిక్ తెరపైకి వచ్చింది. ఇది ఇలా ఉంటే, తాజాగా పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. పవిత్ర కర్ణాటకలోని మైసూర్ లో పుట్టిపెరిగారు.
Advertisement
READ ALSO : సీనియర్ ఎన్టీఆర్ లాంగ్ డ్రైవింగ్ చేస్తే… కుక్కలు, కోళ్లు అవుట్ అంతే…!
తండ్రి మైసూర్ లోకేష్ కర్ణాటక స్టేట్, ఫిలిం యాక్టర్, తల్లి టీచర్, ఆది లోకేష్ అనే బ్రదర్ ఉన్నాడు. 9వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణించడంతో, కుటుంబ పోషణ కోసం తండ్రి నట వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు పవిత్ర. కన్నడ నాట టీవీ నటిగా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా నటించారు. కన్నడలో దాదాపు 150 చిత్రాలు చేసిన పవిత్ర 2006లో ‘నాయి నేరాలు’ మూవీకి గాను కర్ణాటక స్టేట్ అవార్డు అందుకున్నారు.
Advertisement
READ ALSO : Virat Kohli : 1205 రోజుల తర్వాత విరాట్ టెస్ట్ సెంచరీ
మొదటి భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో విడాకులు తీసుకున్న తర్వాత కన్నడ యాక్టర్ సుచేంద్ర ప్రసాద్ తో 11 ఏళ్ల పాటు సహజీవనం చేసి, 2018లో అతని నుండి విడిపోయారు. తర్వాత నరేష్ తో ప్రేమలో పడ్డారు. పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్ గురించి తెలిసి… ఆమె రియల్ లైఫ్ లో రీల్ లైఫ్ ట్విస్టులు, కష్టాలు ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
READ ALSO : కేసీఆర్ ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా : DH శ్రీనివాసరావు