ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు నిర్వహించే విషయం తెలిసిందే. ఈ సారి కూడా టీడీపీ మహానాడు కార్యక్రమమును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ పార్టీ కార్యకర్తలను ఉత్తేజ పరచడానికి ఎప్పటి మాదిరిగానే సీఎం జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి జనాల్లోకి వెళ్లాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నది.
Advertisement
Advertisement
మహానాడు కార్యక్రమం గురించి వివిధ రాజకీయ పార్టీలు వాకబు చేయడం ప్రారంభమయ్యాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తనకు ఉన్న మీడియా సోర్స్ ఇతర టీడీపీ నాయకుల ద్వారా మహానాడు గురించి అడిగి తెలుసుకున్నారట. టీడీపీకి గతంలో పోల్చితే బలం చాలా తక్కువ అయింది. ఆ విషయంలో పవన్ సీరియస్ ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మహానాడు గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సన్నిహితులతో చర్చించాడట. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ మహానాడు గురించి ఆరా తీస్తున్నాడట.
Advertisement
ఇక మహానాడులో జనసేనతో పొత్తు గురించి చంద్రబాబు ఏమైనా మాట్లాడాడా అనే విషయాన్ని కూడా పవన్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే మీడియా వారిని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. మొత్తానికి పవన్ కల్యాణ్ చాలా క్లోజ్‌గా క్లియర్‌గా టీడీపీని గమనిస్తూ ఉన్నాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఓ అవగాహనకు వస్తాడా లేదా అనేది చూడాలి. వీరిద్దరి కలయికను జనాలు నమ్మే పరిస్థితి అయితే కనిపించడం లేదంటూ.. రాజకీయ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.