Home » Pavan Kalyan: పవన్ కళ్యాణ్ చేతి వేళ్లకు ఉన్న.. రెండు ఉంగరాల ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Pavan Kalyan: పవన్ కళ్యాణ్ చేతి వేళ్లకు ఉన్న.. రెండు ఉంగరాల ప్రత్యేకత ఏంటో తెలుసా..?

by Sravya
Ad

Pavan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ ఫోకస్ ని పాలిటిక్స్ మీద పెట్టేసారు. ఒకపక్క సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా పాలిటిక్స్ మీద పెట్టారు. అప్పుడప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి ప్రేక్షకులు అలానే ఫాన్స్ కూడా అటువంటి విషయాలని విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక విషయం వైరల్ గా మారింది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక నమ్మకం అనేది ఉంటుంది. అదృష్టంగా భావించి కలిసి వస్తే మళ్లీ మళ్లీ దానినే ప్రయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకి చాలామంది చేతికి ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు.

Advertisement

ఆ ఉంగరం ఉంటే వాళ్ళకి అంతా మంచి జరుగుతుందని కలిసి వస్తుందని భావిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా దీనిని నమ్ముతారు. పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న ఉంగరాలకు సంబంధించిన విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ టిడిపి బిజెపి కూటమితో ముందుకు సాగుతున్నారు. ఎలక్షన్లు మరికొన్ని రోజుల్లో ఉండడంతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ మీటింగ్లలో చురుకుగా పాల్గొంటున్నారు సభల్లో కూడా పాల్గొంటున్నారు అయితే ఆయన చేతికి ఉన్న ఉంగరాలు తల తల మెరుస్తుండడంతో అందరినీ అవి ఆకట్టుకుంటున్నాయి. రెండు ఉంగరాలలో ఒకటి నాగబంధం. ఇంకొకటి కూర్మావతారం.

Advertisement

Also read:

ఈ రెండూ కూడా బంగారు ఉంగరాలు పెద్ద సైజులో ఇవి ఉన్నాయి ఇవి ఉంగరాలు ధరించడం వలన కలిగే లాభాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నాగబంధం ఉంగరం గురించి చూస్తే నాగుపాము ఆకారం వలన అపమృత్యు దోషాలు ఉంటే నాగబంధం ఉంగరం తొలగిస్తుంది. ఊహించని విపత్తుల నుండి రక్షిస్తుంది. అలానే దుష్ట శక్తుల నుండి కూడా రక్షిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాదు రాహు కేతు దోషాలు నరదృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. కూర్మావతారం ఉంగరం వలన కలిగే లాభాలు ఏంటి అనేది చూస్తే కూర్మావతారం ఉంగరం వలన బలం సంపద వస్తాయి. దైవిక శక్తిని పొందాలనుకునే వాళ్ళు దీనిని ధరిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. పవన్ కళ్యాణ్ పెట్టుకున్న ఈ రెండు ఉంగరాలు కూడా ప్రత్యేకమైనవి. వీటి వలన ఇన్ని ప్రయోజనాలను అయితే పొందొచ్చు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading