Home » Om Bheem Bush Review: ఓం భీమ్ బుష్ కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

Om Bheem Bush Review: ఓం భీమ్ బుష్ కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

by Sravya
Ad

శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతీ ముకుందన్, కామక్షి భాస్కర్ల, ప్రియావడ్లమాని, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి, షాన్ కక్కర్, సూర్య శ్రీనివాస్ తదితరులు నటించారు.

సినిమా:ఓం భీమ్ బుష్
నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతీ ముకుందన్, కామక్షి భాస్కర్ల, ప్రియావడ్లమాని తదితరులు.
దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి
నిర్మాత: సునీల్ బలుసు
సినిమాటోగ్రఫి: రాజ్ తోట డీవోపీ
బ్యానర్: వీ సెల్యులాయిడ్
సమర్పణ: యువి క్రియేషన్స్
మ్యూజిక్: సన్నీ ఎంఆర్
రిలీజ్ డేట్: 2023-03-22

Advertisement

కథ మరియు వివరణ:

కష్టపడకుండా కింగ్‌లా ఉండాలని కృష్ణకాంత్ (శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి (ప్రియదర్శి), మాధవ్ రేలంగి (రాహుల్ రామకృష్ణ) లెగసీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ రంజిత్ వినుకొండ (శ్రీకాంత్ అయ్యంగార్) వద్ద పీహెచ్‌డీ చేసి సైంటిస్టుల కావాలని అనుకుంటారు. అల్లరి చిల్లరి పనులు చేయడం ఆయన తరిమేస్తాడు. ప్రియదర్శి గ్రామం భైరవకొండకు వెళ్తూ పాడుపడిన బంగ్లాలో క్షుద్ర శక్తులు చేసే బైరాగి (షాన్ కక్కర్) గ్రూప్‌ చూస్తాడు. అప్పుడే ఆ గ్రామంలో బ్యాంగ్ బ్రో A to Z సొల్యూషన్ అని ఒక ఏజెన్సీ పెడుతారు. సంపంగి అనే దెయ్యం నివసించే పాడుబడిన బంగ్లాలో నిధులు తీసుకు రావాలని సర్పంచ్, బైరాగులు సవాల్ విసురుతారు. రంజిత్‌ను కృష్ణకాంత్, వినయ్, మాధవ్ ఎలా ఇబ్బందులు పెట్టారు. ఆ ముగ్గురిని ప్రొఫెసర్ ఎందుకు తరిమివేశాడు…? భైరవపురం వెళ్లే క్రమంలో పాడుబడ్డ బంగ్లాలో జరిగిన సంఘటనలు కారణంగా జీవితాలు ఎలా మారాయి..? ఊర్లో ఈ ముగ్గురిని దేవుళ్లుగా కొలిచేలా ఏం చేశారు…? గ్రామానికి పట్టి పీడించే సంపంగి అసలు ఎవరు..? పాడుబడ్డ బంగళాలో నిధుల కోసం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది…? నిధులు దొరికాయా…? ఆ ఊరికి సంపంగి ద్వారా ఎదురైయ్యే కష్టాలు పోయాయా..? తెలియాలంటే ఓం భీమ్ బుష్ సినిమా చూడాలి.

Advertisement

సినిమా అంతా కూడా కొంచెం ఫన్ తో మొదలవుతుంది. ఫన్ ఎలిమెంట్స్ తో పట్టాలెక్కిన మూవీ కామెడీ ట్రాక్ తో పరుగులు పెట్టింది దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు అన్నీ కూడా చక్కగా వర్క్ ఔట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో రెండు మూడు ఎపిసోడ్లు మాత్రం ప్రేక్షకులని సీట్లపై లేచి నవ్వేలా చేసేస్తాయి. విష్ణు రాహుల్ ప్రియదర్శి కామెడీ సూపర్ గా ఉంది లాజిక్ లేని అర్థంపర్థం లేని డైలాగ్ లు కూడా నవ్వించేసాయి. ట్విస్ట్ తో మొదటి హాఫ్ ని ముగించేసారు సెకండ్ హాఫ్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. లాజిక్ తో మూవీ స్టోరీ ని నడిపిన విధానం చక్కగా ఉంది సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఎమోషనల్ గా చెప్పడం అత్యంత బలంగా మారడమే కాకుండా సినిమాని మరో రేంజ్కి తీసుకెళ్లి పోయింది. కామెడీ టైమింగ్ డైలాగ్ డెలివరీతో సినిమా చాలా అద్భుతంగా ఉంది. నటులందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఎడిటింగ్ అదిరిపోయింది. మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

Also read:

ప్లస్ పాయింట్స్

కామెడీ
ఎమోషన్స్
కథ
నటీ నటులు

మైనస్ పాయింట్స్

అక్కడక్కడ సన్నివేశాలు

రేటింగ్ 3.25/5

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading