Home » ఆచార్య డిజాస్టర్ కు కారణాలు చెప్పిన పరుచూరి..!

ఆచార్య డిజాస్టర్ కు కారణాలు చెప్పిన పరుచూరి..!

by Azhar
Ad

మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. అయితే ఈ సినిమాకు ముందు ఎన్ని అంచనాలు ఉన్నాయో.. సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత అవి సగానికి తగ్గిపోయాయి. అలాగే సినిమా విడుదలైన తర్వాత మొదటి రోజు మొదటి షోకె ఆచార్య డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ప్లాప్ అనేది దర్శకుడు కొరటాల శివను కూడా పెద్ద దెబ్బ అనేది కొట్టింది. ఇక ఈ సినిమా నష్టాన్ని పూర్చడానికి ముగ్గురు.. చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల తమ తమ రెమ్యునరేషన్ అనేది తిరిగి వెన్నకి ఇచ్చేసారు.

Advertisement

అయితే ఈ సినిమా విడుదలై డిజాస్టర్ అయిన తర్వాత సినిమా గురించి చాలా మంది చాలా మాట్లాడారు. ఇందులో కొరటాల ఫ్లేవర్ అనేది కనిపించలేదు అని చెప్పారు. అలాగే కథ కూడా బాగాలేదు అని అన్నారు. అయితే ఈరోజు ఆచార్య డిజాస్టర్ కు కారణాలు చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ. అయితే గోపాలకృష్ణ ప్రతి సినిమా గురించి తన అనాలసిస్ అనేది చెబుతూ ఉంటారు. సినిమాలో లోపాలు ఏంటి అనేవి.. యూట్యూబ్ వేదికగా ప్రకటిస్తారు. అయితే ఆయన ఇప్పుడు ఆచార్య గురించి వివరించారు.

Advertisement

గోపాలకృష్ణ మాట్లాడుతూ.. మొదట ఈ కాలంలో జనానికి కమ్యూనిజం అనేది ఎక్కడం లేదు అని చెప్పారు. అలాగే రామ్ చరణ్ ఈ సినిమాలో ఉన్నాడు అని అందరికి తెలుసు. అందుకే ఆయన పాత్రను సెకండ్ హాఫ్ వరకు దాచి ఉంచకుండా మొదటి భాగంలోనే విడుదల చేస్తే బాగుండేది అన్నారు. ఇంకా ఒక్కే పని చేయడానికి ఇద్దరు స్టార్లు అవసరం ఉండదు. అందుకే సినిమాలో చిరంజీవికే 90 శాతం కేటాయించి సిద్ధ పాత్రకు 10 ఇస్తే బాగుండేది అన్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి గారి పోషితున పాత్రకు.. ఆ అభ్యుదయభావానికి తగ్గిన విధంగా డ్యాన్సులు అనేవి ఆయన చేయకుండా ఉండాల్సింది అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకముందు ఏం జరిగిందో చెప్పిన ద్రావిడ్..!

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై దినేష్ ఫైర్.. ఎందుకంటే..?

Visitors Are Also Reading