Home » Pakeezah: పెద రాయుడు సినిమాలో పాకీజా గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

Pakeezah: పెద రాయుడు సినిమాలో పాకీజా గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

by Bunty
Ad

ఈ మధ్యకాలంలో చాలామంది సీనియర్ నటులు కనీసం తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, అనేక ఇబ్బందులు పడుతూ రోడ్లపై ఉంటున్న పరిస్థితులు అనేకం కనిపిస్తున్నాయి. తాజాగా అలనాడు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో చేసి, కనీసం డేట్స్ కూడా దొరకని పరిస్థితుల్లో ఉండే ఈ హాస్యనటి పాకీజా కనీసం ఒక పూట తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలోకి వచ్చింది. మరి అలా రావడానికి కారణాలు ఏంటో చూద్దాం.

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసెంబ్లీ రౌడీ మూవీ తో పాకీజా పాత్ర చాలా పాపులర్ అయింది. దీని తర్వాత రౌడీ, ఇన్స్పెక్టర్, పేదరాయుడు వంటి చిత్రాల్లో నటించింది. ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో 150 కి పైగా సినిమాలు చేసిందట. అలాంటి ఈ నటి పరిస్థితి చాలా దారుణమైంది. పాకిజా లేడీ కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆస్తులు ఏమి సంపాదించుకోలేదట. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, టాలీవుడ్ లో 150 సినిమాలు చేశానని ఏఎన్ఆర్, ఎన్టీఆర్ బాలయ్య, మోహన్ బాబు ఇలా పెద్ద పెద్ద స్టార్ హీరోలతో తెరను పంచుకున్నారని అన్నారు.

Advertisement

ఇక సినిమాలు మానేశాక నా సొంత ఊరు అయిన కారైకుడికి వెళ్లానని, నా బెస్ట్ ఫ్రెండ్ జయ లలిత అని చెప్పుకొచ్చింది. కొన్నాళ్లుగా ఆర్థిక పరిస్థితి బాగోలేదని అందుకే ఇక్కడికి వచ్చాను అని తెలియజేసింది. 150 సినిమాలు నటించిన నేను కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయానని అన్నారు. ఎంతో మంది స్టార్ హీరోలను కలిశానని తన పరిస్థితి చెప్పానని, చివరికి సీఎం కుమారుడు ఉదయనిది స్టాలిన్ ని కూడా కలిసి నా పరిస్థితి వివరించానని కానీ ఎవరూ కూడా హెల్ప్ చేయలేదని ఎమోషనల్ అయింది.

READ ALSO : అట్లుంటది మనతోని..NTR ను కలిసిన టీమిండియా..ఫోటోలు వైరల్

Visitors Are Also Reading