హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో చాలా గందరగోల వాతావరణం ఏర్పడింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, అంశంపై విద్యార్థులంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకేజ్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు, రేపు ఆట్స్ కాలేజీ ముందు మహాదీక్ష చేయడానికి విద్యార్థులు రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగానే విద్యార్థులు సిద్ధమయ్యే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఓయూ గేట్లను మూసివేసారు.
also read:“బలగం” బడ్జెట్ 1.5కోట్లు.. లాభం ఎన్ని కోట్ల అంటే..?
Advertisement
లోపలి వారిని బయటికి, బయటి వారిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు.. కానీ ప్రస్తుతం ఓయూలో సెమిస్టర్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే మహాదీక్ష పూనుకున్నారు విద్యార్థి సంఘాలు. ఈ దీక్షను ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Advertisement
also read:అలా చెప్పి దుబాయిలో టార్చర్ చేశారు..నటి సనా బేగం..!!
ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఆర్ట్స్ కాలేజ్ దీక్షలో కూర్చున్నారు. దీంతో కొంతమంది విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ తరుణంలోని నగేష్ అనే ఒక విద్యార్థి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు మరియు విద్యార్థులకు మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది.. మరి ఈ ఉద్యమం ఎక్కడి వరకు చేరుతుందో చూడాలి..
also read:నా హస్బెండ్ ఆ ఒక్క పనికి తప్ప నాకు అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వడు.. ఓ భార్య ఆవేదన..!!