Home » అలా చెప్పి దుబాయిలో టార్చర్ చేశారు..నటి సనా బేగం..!!

అలా చెప్పి దుబాయిలో టార్చర్ చేశారు..నటి సనా బేగం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఏ నటి జీవితం చూసినా ఏమున్నది గర్వకారణం.. ఎవరిని చూసినా బాధల పారాయణత్వం అన్నట్టు ఉన్నది ప్రస్తుత పరిస్థితి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఎంతో గుర్తింపు సాధించింది నటి సనా బేగం. మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఆమె నిన్నే పెళ్ళాడుతా అనే చిత్రం ద్వారా బెనర్జీ వైఫ్ గా చేసి మంచి గుర్తింపు అందుకుంది. ఇక చక్రవాకం అనే సీరియల్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఓవైపు సీరియల్స్ చేస్తూ మరోవైపు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకొని స్టార్ నటిగా మారింది. అలాంటి సనా బేగం రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్ లో జరిగినటువంటి బాధాకరమైన విషయాలను పంచుకుంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

also read:న‌రేష్ ప‌విత్ర‌ల పెళ్లి పై ఫుల్ క్లారిటీ..దీని కోసమే అంతపని చేశారా…?

Advertisement

తాను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే సమయంలోనే వివాహం జరిగిందట.. తన తండ్రి పెద్ద వ్యాపారస్తులు.. ఓసారి వ్యాపారం విపరీతంగా లాస్ అవ్వడంతో తండ్రి తనకు తొందరగా పెళ్లి చేశారని అన్నది. ఆ తర్వాత అత్తింటి వారి సహకారంతో పై చదువులు చదివానని తెలియజేసింది. ముందుగా స్కూలు పెట్టాలని నా ఆలోచన ఉండేదని, కానీ వీలుకాక మోడలింగ్ వైపు అడుగు వేసానని అలా మా అత్తమామల సపోర్టుతో మోడలింగ్లో రాణిస్తున్న సమయంలో నిన్నే పెళ్ళాడుతా అనే సినిమాలో అవకాశం వచ్చింది. దీంతో నా లైఫ్ మారిపోయింది. ఇక ఇద్దరు పిల్లలు పుట్టినా తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సన తన పిల్లల్ని మాత్రం ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు. దీనికి ప్రధాన కారణం పిల్లలకు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం లేదట.

Advertisement

also read:Ajith Kumar : స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం..

అయితే తన కూతురును చదివించి చదువయ్యాక కూతురు పెళ్లి చేసి అత్తారింటికి పంపిందట. కానీ అత్తవారింటి వారు చాలా మోసం చేశారని ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా ఉపయోగపడిందని తెలిపారు. నా కూతురు అత్తవారు దుబాయ్ లో ఇల్లు ఉందని చెప్పి నా కూతుర్ని అక్కడికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని, అక్కడ ఒకచోట అని చెప్పి మరోచోట ఉంచారని తెలియజేసింది. ఈ విషయాలు తన కూతురు నాకు చెప్పకపోయినా నేను తెలుసుకున్నానని, తెలంగాణ పోలీసుల సహాయంతో వారి మోసాలను గ్రహించి అరెస్టు చేయించామంటూ చెప్పింది. నా కూతురుని అక్కడికి తీసుకెళ్లి చాలా టార్చర్ చేశారని ఆ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టింది.

also read:Mar 24th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Visitors Are Also Reading