Home » చిరంజీవి, వెంకటేష్, నాగార్జున “గంగోత్రి” సినిమాకి ముందుగా అనుకున్న హీరోస్ ! అల్లు అర్జున్ చేతికి ఎలా వెళ్ళింది ?

చిరంజీవి, వెంకటేష్, నాగార్జున “గంగోత్రి” సినిమాకి ముందుగా అనుకున్న హీరోస్ ! అల్లు అర్జున్ చేతికి ఎలా వెళ్ళింది ?

by AJAY

టాలీవుడ్ లోని లెజండ‌రీ డైరెక్ట‌ర్ ల‌లో రాఘ‌వేంద్ర‌రావు కూడా ఒక‌రు. ఆయ‌న సినిమాల‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. చిరంజీవి, ఎన్టీరామారావు లాంటి స్టార్ హీరోల‌కు రాఘ‌వేంద్ర‌రావు ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌ను ఇచ్చారు. అంతే కాకుండా రాఘ‌వేంద్ర‌రావు ద్వారా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన హీరోలు ఇప్పుడు స్టార్ హీరోలుగా రానిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా మొద‌ట ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది ద‌ర్శ‌కేంద్రుడే.

వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన గంగోత్రి సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా క‌థ మ‌రియు పాట‌లు మాట‌లు ఇలా ప్ర‌తిఒక్క‌టీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. దాంతో మొద‌టి సినిమాతో బ‌న్నీ ఖాతాలో సూప‌ర్ హిట్ ప‌డింది. అయితే నిజానికి ఈ సినిమా మొద‌ట బ‌న్నీ కోసం అనుకోలేదు. ఇక ఈ సినిమాకు మొద‌ట అనుకున్న హీరోలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం…

also read:  వాయిదా పడిన ఉగ్రం.. విడుదల ఎప్పుడంటే ? 

ఈ సినిమా క‌థ‌ను రాఘవేంద్ర‌రావు చిరంజీవికి వినిపించార‌ట‌. కొత్త హీరో కావాల‌ని రామ్ చ‌ర‌ణ్ కు అయితే క‌థ సెట్ అవుతుంద‌ని చెప్పార‌ట‌. కానీ చిరు రామ్ చ‌ర‌ణ్ కు ఇంకా మెట్యురిటీ రావాల‌ని చెప్పి గంగోత్రి సినిమాకు నో చెప్పారు. ఆ త‌ర‌వాత నంద‌మూరి మోహ‌న కృష్ణ గంగోత్రి సినిమాను త‌న కుమారుడు తార‌క‌ర‌త్న తో చేయాల‌ని కోరారు.

మ‌రోవైపు అల్లు అరవింద్ కూడా గంగోత్రి సినిమాను బ‌న్నీ తో తీయాల‌ని కోరారు. ఈ సినిమాకు అల్లు అర‌వింద్ కూడా ఓ నిర్మాత దాంతో ఆయ‌న మాట కాదు అన‌లేక బ‌న్నీతో గంగోత్రి సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో ఆర్థి అగ‌ర్వాల్ చెల్లెలు అధితి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో పాటూ అధితి మరియు అల్లు అర్జున్ ల‌కు వ‌రుస ఆఫ‌ర్ లు వ‌చ్చాయి.

ALSO READ : నా బాడీ, బరువుపై ట్రోల్స్ చేస్తున్నారు-హనీ రోజ్

Visitors Are Also Reading