Home » విడాకుల దిశ‌గా మ‌రో టాలీవుడ్ జంట‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌…!

విడాకుల దిశ‌గా మ‌రో టాలీవుడ్ జంట‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌…!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో విడాకుల ట్రెండ్ న‌డుస్తోంది. ఒక్కొక్క‌రుగా త‌మ వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నారు. బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా విడాకులు తీసుకుంటూ అభిమానుల‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. టాలీవుడ్ లో ల‌వ్లీ పెయిర్ గా ఎంతో గుర్తింపు ఉన్న స‌మంత నాగ చైత‌న్య మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా త‌మ నాలుగేళ్ల వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసిన సంగ‌తి తెలిసిందే.

Samantha nagachaitanya

Samantha nagachaitanya

ఇక రీసెంట్ గా త‌మిళ స్టార్ హీరో ధనుష్ ఆయ‌న భార్య ఐశ్వ‌ర్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌ర్నీ షాక్ కు గురి చేశాడు. అయితే ఇప్ప‌డు త్వ‌ర‌లోనే మ‌రో సెల‌బ్రెటీ జంట కూడా విడాకులు తీసుకోబోతుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే వారి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌స్తున్నాయంటూ వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆ హీరో రెండు మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

Advertisement

Advertisement

Danush Aishwarya

Danush Aishwarya

కానీ అనుకున్నమేర విజ‌యం సాధించ‌లేక‌పోయాడు. అంతే కాకుండా ప్ర‌స్తుతం మ‌రో రెండు సినిమాల్లో హీరోగా న‌టిస్తున్నాడు. మ‌రో వైపు ఇప్ప‌టికే ఆ హీరోకు ఇండ‌స్ట్రీలో స‌పోర్ట్ లేకుండా పోయింది. సంక్రాంతికి ఓ సినిమా చేసినా ఎటువంటి ప్ర‌మోష‌న్లు కూడా జ‌ర‌గ‌లేదు. ఇక ఆ హీరో భార్య ఓ పెద్దింటికి చెందిన యువ‌తి కావ‌డం విశేషం.

వీరిద్ద‌రికీ ఒక కూతురు కూడా జ‌న్మించింది. అయితే వీరిద్ద‌రినీ మ‌ళ్లీ క‌లిపేందుకు కుటుంబ స‌భ్యులు ఎంత‌గానో ప్ర‌యత్నాలు కూడా జ‌రిపార‌ట‌. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయినట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్తలు చెక్క‌ర్లు కొడుతున్నాయి. దాంతో త్వ‌ర‌లోనే ఈ జంట త‌మ విడాకుల‌ను అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

also read : సంక్రాతికి హీరోగా వ‌చ్చిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా…!

Visitors Are Also Reading