Home » సంక్రాతికి హీరోగా వ‌చ్చిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా…!

సంక్రాతికి హీరోగా వ‌చ్చిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా…!

by AJAY
Ad

ఇటీవ‌లి కాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ లు సినిమా హీరోలుగా ఎంట్రీ ఇవ్వ‌డం పెరిగిపోయింది. అప్ప‌ట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అల‌రించిన త‌నిష్ ఆ త‌ర‌వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా పూరీ జ‌గ‌న్నాత్ త‌న‌యుడు ఆకాష్ పూరి కూడా హీరోగా ప‌రిచ‌య‌మై వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు రీసెంట్ గా చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

జాంబిరెడ్డి సినిమాతో ఈ యంగ్ హీరో సూప‌ర్ హిట్ కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కానీ అత‌డు చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించాడ‌ని మాత్రం చాలా మందికి తెలియ‌దు. మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన నాని సినిమా ప్ర‌తిఒక్క‌రికీ గుర్తుండి పోతుంది. ఈ సినిమా క‌మర్షియ‌ల్ హిట్ కాక‌పోయిన‌ప్ప‌టికీ మ‌హేశ్ బాబు న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు.

Advertisement

అయితే ఈ సినిమాలో మ‌హేశ్ బాబు చిన్న‌నాటి పాత్ర‌ను పోశించిన బాబు తో పాటు మ‌రో బుడ్డోడు కూడా ఉంటాడు. ఆ బుడ్డోడు ఎవ‌రో కాదు. రీసెంట్ గా హీరో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అశోక్ గ‌ల్లానే….నాని సినిమాతో పాటూ ఈ హీరో సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా న‌టించిన మ‌రో సినిమాలో కూడా బాల న‌టుడిగా చేశాడ‌ట‌.

ఈ విష‌యాన్ని అశోక్ గ‌ల్లా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అయితే కృష్ణ సినిమాలో న‌టించిన‌ప్పుడు త‌న‌కు పెద్ద‌గా ఊహ తెలియ‌ద‌ని కానీ నాని సినిమా నాటి జ్ఞాప‌కాలు ఇంకా గుర్తుకు ఉన్నాయ‌ని చెప్పాడు. ఇదిలా ఉండ‌గా సంక్రాతి బ‌రిలోకి దిగి అశోక్ గ‌ల్లా హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. క‌లెక్ష‌న్ల ప‌రంగా త‌క్కువే ఉన్న‌ప్ప‌టికీ పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది.

Visitors Are Also Reading