Home » అరెరే.. ఇంత మంచి సినిమాలను బన్నీ రిజెక్ట్ చేశాడా.. కారణమేంటి..?

అరెరే.. ఇంత మంచి సినిమాలను బన్నీ రిజెక్ట్ చేశాడా.. కారణమేంటి..?

by Sravanthi Pandrala Pandrala

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ స్టార్ హీరోల్లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన ఏ మూవీలో నటించిన కొత్త పాత్ర, కొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మైమరపిస్తారు. అంతటీ స్టార్డమ్ ఉన్న బన్నీ తన కెరీర్ లో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ను వదులుకున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..? ఇప్పటికే 25 సినిమాల్లో నటించిన అల్లు అర్జున్ తన సినీ జీవితంలో ఎన్నో హిట్లను, ఫ్లాపులను చూశాడు. ఈ తరుణంలోనే చాలా సినిమాలను కూడా వదులుకున్నాడు.1) బొమ్మరిల్లు
సిద్ధార్థ హీరోగా నటించి బాక్సఫీస్ రికార్డు సాధించిన మూవీ. క్లాస్ గా ఉండే ఈ మూవీ సిద్ధార్థ కెరీర్ ను యూటర్న్ తిప్పింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఈ కథని ముందుగా అల్లు అర్జున్ కు చెప్పారట దర్శకుడు భాస్కర్. కథ బాగా నచ్చినప్పటికీ హ్యాపీ సినిమా షూటింగ్ లో ఉన్నాడని దీన్నీ రిజెక్ట్ చేశాడు.2) 100% లవ్
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో 10 ఏళ్ల క్రితమే
ఈ సినిమా రావాల్సి ఉంది. సుకుమార్ ముందుగా ఏ కథ రాసుకున్న ముందు అల్లు అర్జున్ కు చెప్పేవారట. ఈ విధంగానే 100% లవ్ కథ అని చెప్పగా ఎందుకో బన్నీ దీనికి కనెక్ట్ కాలేకపోయాడట. అయినా ఇలాంటి సాఫ్ట్ లవ్ స్టోరీస్ నా బాడీ లాంగ్వేజ్ కు సెట్ అవ్వదు అని చెప్పి రిజెక్ట్ చేశారట. కానీ సినిమా నాగ చైతన్య చేసి బంపర్ హిట్ కొట్టాడు.3) అర్జున్ రెడ్డి
ఈ సినిమాతో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సందీప్. అయితే ఈ సినిమా కథను ముందు అల్లు అర్జున్ కు చెప్పారట ఆయన. అయితే అర్జున్ రెడ్డి క్యారెక్టర్ చేయడానికి బన్నీ సాహసం చేయలేదట. దీంతో దర్శకుడు సందీప్ వంగా విజయ్ దేవరకొండతో తీసి సరికొత్త ట్రెండ్ ను సెట్ చేశాడు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కాస్త రౌడీ హీరోగా మారిపోయాడు.4) గీత గోవిందం
పరశురామ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ మూవీ పూర్తి ప్రేమ కథ చిత్రం. ఈ స్టోరీ లో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉండటం వలన అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ కు ఈ కథ డ్యామేజ్ చేస్తుందని భావించి రిజెక్ట్ చేశారట. ఇదే స్టొరీ తో విజయ్ దేవరకొండ బంపర్ హిట్ కొట్టాడు.

ALSO READ;

అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర వద్దనుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

హీరో శ్రీహరి భార్య తిడుతూ ఎన్నో శాపాలు పెట్టేది.. డైరెక్టర్ నిమ్మల శంకర్ షాకింగ్ వ్యాఖ్యలు..?

Visitors Are Also Reading