Home » హీరో శ్రీహరి భార్య తిడుతూ ఎన్నో శాపాలు పెట్టేది.. డైరెక్టర్ నిమ్మల శంకర్ షాకింగ్ వ్యాఖ్యలు..?

హీరో శ్రీహరి భార్య తిడుతూ ఎన్నో శాపాలు పెట్టేది.. డైరెక్టర్ నిమ్మల శంకర్ షాకింగ్ వ్యాఖ్యలు..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే శ్రీ హరి అని చెప్పవచ్చు. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలో కూడా అద్భుతంగా చేసే టాలెంట్ ఉన్నా హీరో శ్రీహరి. ఆయన డిస్కో శాంతిని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు నిమ్మల శంకర్ తో శ్రీహరికి చాలా స్నేహం ఉండేది. ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో శ్రీహరి మరియు ఆయన భార్య డిస్కో శాంతి గురించి ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. శ్రీహరి తీసిన భద్రాచలం సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చాలా కష్టం గా ఉండేవి. ఒక సన్నివేశంలో మాత్రం శ్రీహరిని పూర్తిగా తలకిందులుగా వేలాడదీసి తెరకెక్కించాలీ. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో డిస్కోశాంతి నా భర్తను చంపేస్తారా అంటూ అభ్యంతరం వ్యక్తం చేసేదని ఈ సందర్భంగా దర్శకుడు తెలిపారు. నాకు ఎంతో చనువు ఉండటం వలన ఇలాంటి సన్నివేశాలను తీసేటప్పుడు తను తిడుతుంది అని మేమిద్దరం అనుకునేవాళ్లం. అనుకున్న విధంగానే మమ్మల్ని ఆమె తిడుతూ మాకు శాపాలు కూడా పెట్టేదని ఇంటర్వ్యూలో వెల్లడించారు. శ్రీహరి చాలా అద్భుతంగా మోహన్ బాబు గారి డైలాగులు చెప్పేవారని ఈ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన మూవీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి అనారోగ్య సమస్యలతో మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు సినీ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ALSO READ;

Advertisement

త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య ఎవరో తెలుసా…? ఆమె ఏం చేస్తారంటే…!

F3 ప్రదీప్:అచ్యుత్ మరణానికి కారణం ఇదేనా.. ఆ రోజు హాస్పిటల్ లో ఏం జరిగిందో తెలుసా..?

 

Visitors Are Also Reading