Home » Oct 1st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Oct 1st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి కెటిఆర్ షాక్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ ను కేటీఆర్ బ్లాక్ చేశారు.

modi

Advertisement

ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవలను ప్రారంభించారు. ముందుగా మెట్రో నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరించనున్నాయి.

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం గందమల్లలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి ఇంటిపై యువతి బంధువు దాడి చేశారు. యువకుడి ఇంటిని తగలబెట్టడం తో కేసు నమోదు అయ్యింది.

రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర రెండో రోజుకు చేరింది. రాహుల్ యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది.

ఐదో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. భక్తుల రద్దీతో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రేపు మధ్యహ్నం వరకు ఘాట్‌ రోడ్లలో బైక్‌లు నిలిపివేయనున్నారు.

Advertisement

జమ్మూ కాశ్మీర్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బందిపొరా గురేజ్‌ సెక్టార్‌ వద్ద తనిఖీల్లో పేలుడు సంభవించింది. 7 రైఫిళ్లు, 2 పిస్టళ్లు, 21 మ్యాగజైన్లు, 13 గ్రనేడ్లు లభ్యం అయ్యాయి.

రాజన్నసిరిసిల్ల వేములవాడలో రేపు సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. వేములవాడలో 7 రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. సద్దుల బతుకమ్మ వేడుకలకు గవర్నర్ తమిళి సై హాజరు కానున్నారు.

హైదరాబాద్ నగరంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలులోకి వచ్చాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠినచర్యలు తీసుకుంటామని ఆదేశాలు జరి చేశారు. స్టాప్ లైన్ దాటి ముందుకు వస్తే రూ,100 జరిమానా విధించననున్నారు. ఫ్రీలెఫ్ట్‌ ను బ్లాక్ చేస్తే రూ.1000 జరిమానా విధింవచనున్నారు.
పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తే రూ.600 ఫైన్ వేయనున్నారు.

Visitors Are Also Reading