Home » ఐకాన్ స్టార్ తో అట్లీ సినిమా.. అధికారిక ప్రకటన కూడా అప్పుడే..!

ఐకాన్ స్టార్ తో అట్లీ సినిమా.. అధికారిక ప్రకటన కూడా అప్పుడే..!

by Sravya
Ad

అట్లీ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. తమిళ దర్శకుడు అట్లీ తెలుగు వాళ్ళకి కూడా సుపరిచితమే. వరుస హిట్లతో దూసుకు వెళ్ళిపోతున్నారు అట్లీ. రాజా రాణి మొదలు ఇప్పుడు జవాన్ వరకు ఎన్నో బంపర్ హిట్స్ ని కొట్టేశారు అట్లీ. ఈ కుర్ర దర్శకుడు షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమాని తీసి వావ్ అనిపించుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన విషయం తెలిసిందే అయితే అట్లీ తదుపరి సినిమాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

అల్లు అర్జున్ కి స్టోరీ చెప్పారట, ఆయన కూడా అందుకు ఓకే అన్నారట. పుష్పటు సినిమా తర్వాత అట్లితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించి అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప టు సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఒక సినిమా సందీప్ వంగతో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి పుష్ప టు సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తారనేది చూడాలి.

Also read:

Visitors Are Also Reading