Home » ‘సైమా’లో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్.. సోషల్ మీడియాలో వైరల్..!

‘సైమా’లో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్.. సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Ad

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా ఎన్టీఆర్ మరోసారి అభిమానుల మీద తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఫ్యాన్స్ గురించి ఆయన మాట్లాడిన ఒక్కో మాట గుండె లోతుల్లోంచి వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ దుబాయ్ లో ఉన్నారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కోసం వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. సైమాలో ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పురస్కార వేడుకకు ఆయన కళ తీసుకొచ్చారు. సైమా 2023లో RRR మూవీకి ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. 

Advertisement

ముఖ్యంగా RRR మూవీలో కొమురం భీముడిగా జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. సైమా ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మళ్లీ మళ్లీ తనను నమ్మిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు ఎన్టీఆర్. అదేవిధంగా ఆర్.ఆర్.ఆర్. మూవీలో తనతో పాటు నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ధన్యవాదాలు తెలిపారు. రామ్ చరణ్ ను బ్రదర్ అని పిలిచారు ఎన్టీఆర్. ఇక ఆ తరువాత అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Advertisement

అభిమానులదరికీ థ్యాంక్స్.  “నా ఒడిదుడుకుల్లో.. నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపింది మీరే . నా కళ్ల వెంట వచ్చిన ప్రతీ నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్లు కూడా నవ్వారు. నా అభిమాన సోదరులు అందరికీ పాదాభివందనాలు”  అని చాలా ఎమోషనల్ గా మాట్లాడారు ఎన్టీఆర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.RRR మూవీలో కొమురం భీముడిగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో వీరోచితంగా కనిపించారో.. భావోద్వేగభరిత సన్నివేశాల్లో అంతలా కంటతడి పెట్టించారు. కొమురం భీముడో.. కొమురం భీముడో పాటలో ఆయన అభినయం అయితే ప్రేక్షకుల గుండెలను పిండేసింది. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించింది.అందుకే ఎన్టీఆర్ నటనకు సైమా అవార్డు లభించింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 ప్రభాస్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? తెలుగు హీరోలలో ప్రభాస్ ఏ నెంబర్ వన్ ఆ..?

పెళ్లి చేసుకోబోతున్న కృతిశెట్టి-వైష్ణవ్ తేజ్.. ఇది వాస్తవమేనా ?

Visitors Are Also Reading