జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటన అద్భుతమని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. కొందరూ అయితే ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ ఇవ్వాలని కూడా పేర్కొనడం విశేషం. ఇదిలా ఉంటే మరోవైపు ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారా సినిమాలకు ప్రాధాన్యత కల్పిస్తారా అనే విషయం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
Advertisement
ఇటీవలే లక్ష్మీపార్వతి ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా నా మనవడే అని, నా భుజంపైన.. తాతా భుజం పైన చేయి వేసి ఫోటో దిగాడని గుర్తు చేసుకుంది. ఇక ఆ తరువాత నా ఫోటో చించేసి అవతల పడేశాడని చెప్పుకొచ్చింది. తాత గారితో ఉన్న ఫోటో బయట కనిపిస్తోందని, నాతో దిగిన ఫోటో బయట కనిపించడం లేదని తెలిపింది. ఆ రోజుల్లో నేను తారక్ ని చాలా బాగా చూసుకున్నానని గుర్తు చేసుకుంది. వైభవంతో ఉన్నప్పుడే అందరూ వస్తారని, వైభవం పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఎవ్వరూ గుర్తుకు రారని ఆమె కామెంట్లు చేశారు.
Advertisement
Also Read : ఎన్టీఆర్ తో ఆ సీన్ చచ్చిన చేయనని ఖరాకండిగా చెప్పేసిన భానుమతి.. ఎందుకో తెలుసా ?
అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ ఎవరిపై డిపెండ్ కాలేదని చెప్పారు. ఎన్టీఆర్ టీడీపీలోకి వచ్చినా నేను వైసీపీలోనే కొనాసాగుతాను. టీడీపీ ఓడిపోయిన సమయంలో ప్రజలకు చేయాల్సిన పనులన్నీ చేశానని ప్రజలకు ఏం తక్కువ చేశానో అర్థం కావడం లేదని సీనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకున్నారు. బాల్యం నుంచి సీనియర్ ఎన్టీఆర్ కి నేను వీరాభిమానిని ఆమె చెప్పింది. సీనియర్ ఎన్టీఆర్ ను కలవకపోయినా ఆయన బ్రయోగ్రఫి రాసేదని చెప్పుకొచ్చింది. నేను రాసిన బయోగ్రఫీలో ఆయనకి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయని కామెంట్స్ చేసింది లక్ష్మీపార్వతి.
Also Read : మెగాస్టార్ అభిమానులకు శుభవార్త.. వాల్తేరు వీరయ్య నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేది అప్పుడే ?