Home » ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు హీరోల చదువు, ఆస్తుల వివరాలు ఎవరికీ తెలియని ఈ 10 విషయాలు !

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు హీరోల చదువు, ఆస్తుల వివరాలు ఎవరికీ తెలియని ఈ 10 విషయాలు !

by Anji
Ad

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో భిన్న ధృవాలుగా, ప్ర‌త్య‌ర్థులుగా పేరు పొందిన మెగా, నంద‌మూరి కుటుంబాల‌ను ఒక్క‌తాటిపైకి తీసుకొస్తూ.. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్‌. మెగా, నంద‌మూరి వార‌సులు అయిన రామ్‌చర‌ణ్‌, ఎన్టీఆర్ ఈ చిత్రంలో క‌లిసి న‌టించారు. వీరిద్ద‌రూ ఎప్ప‌టి నుంచో మంచి స్నేహితులు. ఈ నేప‌థ్యంలో త‌మ మైత్రి బంధాన్ని తెర‌పై కూడా అద్భుతంగా చూపించారు. జ‌క్క‌న్న టేకింగ్ ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల న‌ట‌న‌తో ఆర్ఆర్ఆర్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

Advertisement

అందుకే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా కాసుల వ‌ర్షం కురుస్తుంది. త్వ‌ర‌లోనే వెయ్యి గ్రాస్ మార్క్‌ను ట‌చ్ చేయ‌బోతుంది. స‌మ్మ‌ర్ హాలీడేస్ అడ్వాంటేజీ కూడా ఉంది కాబట్టి లాంగ్ ర‌న్‌లో ఆర్ఆర్ఆర్ దూకుడును ఆప‌డం క‌ష్ట‌మేన‌ని పండితులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్‌ల వ్య‌క్తి గ‌త జీవితం ఆస్తులు, ఆదాయం బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల‌ను అభిమానుల‌కు కూడా ఈ విష‌యాల గురించి తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. వీరిలో ఎవ్వ‌రూ ఏ విష‌యంలో టాప్ ఉన్నారంటూ.. సోష‌ల్ మీడియాలో పెద్దఎత్తున చ‌ర్చించుకుంటున్నాయి. ఈ త‌రుణంలో వీరిద్ద‌రి లైఫ్ స్టైల్‌ను ఓసారి ప‌రిశీలిద్దాం..!

1. ల‌గ్జ‌రీ కార్లు మ‌న తెలుగు హీరోల‌కు కార్లు అంటే ఎంతో మోజు. అందుకే మార్కెట్‌లో కొత్త మోడ‌ల్ లాంచ్ అయినా ముందుగా హీరోలే దానిని కొనుగోలు చేస్తుంటారు.

2. టాలీవుడ్ హీరోల‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు కార్లు అంటే మ‌క్కువ ఎక్కువ‌. కొత్త‌గా ఏదైనా మోడల్ కారు వ‌చ్చిందంటే తార‌క్ గ్యారేజ్‌లోకి చేరాల్సిందే. గ‌త ఏడాది ఎన్టీఆర్ లంబోర్షిని యూరుస్ గ్రాఫైట్ మోడ‌ల్ కారును ఆర్డ‌ర్ చేశారు. అంతేకాదు మ‌న‌దేశంలో ఈ కారును కొన్న తొలి వ్య‌క్తిగా జూనియ‌ర్ నిలిచారు. దీని ఖ‌రీదు అక్ష‌రాల 3.16కోట్లు. దీంతో పాటు ఆయ‌న వ‌ద్ద మెర్సీడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ, రేంజ్ రోవ‌ల్ వోగ్యూ ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా పోర్షే 718 కేమ్యాన్‌ను 85.95 ల‌క్ష‌లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ ఎక్కువ‌గా వినియోగించే కారు బీఎండ‌బ్ల్యూఎల్‌డీ.. దీని ధ‌ర 1.32 కోట్లు.. దీనిని స్వ‌యంగా ఎన్టీఆర్ న‌డుపుతున్నారు.


3. ఇక చ‌ర‌ణ్ విష‌యానికొస్తే.. ఆస్ట‌న్ మార్టిన్ వాంటేజ్ కారును ఆయ‌న వినియోగిస్తారు. దీనిని ఆయ‌న తండ్రి చిరంజీవి చ‌ర‌ణ్‌కు గిప్ట్‌గా ఇచ్చారు. దీంతో పాటు ఆయ‌న వ‌ద్ద మెర్సీడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఎస్‌యూవీ ఉంది. దీని ధ‌ర రూ.80ల‌క్ష‌లు. ఇకపోతే.. చ‌ర‌ణ్ గ్యారేజ్‌లో 3.34 కోట్ల రోల్స్ రాయిస్ ఫాంట‌మ్‌, 3.5 కోట్ల రేంజ్ రోవ‌ల్ ఆటోబ‌యోగ్ర‌ఫీ ఉన్నాయి.

Advertisement

4. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంద‌ని స‌మాచారం. దీనిని హైద‌రాబాద్ శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌లో పార్కు చేసి ఉంచుతారు.

5. రాంచ‌ర‌ణ్‌ విష‌యాకొస్తే.. ఆయ‌న‌కు స్వ‌యంగా ట్రూజెట్ పేరిట సొంతంగా ఎయిర్‌లైన్ కంపెనీ ఉంది.

6. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో విలాస‌వంత‌మైన భ‌వ‌నం ఉంది.

7. రామ్‌చ‌ర‌ణ్‌, చిరంజీవి ఎన్టీఆర్‌కు ప‌క్క ఇళ్ల‌లోనే నివ‌సిస్తున్నారు. వీరికి కూడా విలాస‌వంత‌మైన భ‌వ‌నాలున్నాయి.

8. అదేవిధంగా జూనియ‌ర్‌కు హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, క‌ర్నాట‌క‌లో విలాస‌వంత‌మైన భ‌వనాలున్నాయి.


9. రామ్‌చ‌ర‌ణ్‌ హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లో ఇటీవ‌ల ఇల్లు కొనుక్కున్నారు. దీని విలువ అక్ష‌రాల రూ.30కోట్లు ఉంటుంద‌ని అంచనా.

10. జూనియ‌ర్ ఎన్టీఆర్ నిక‌ర ఆస్తుల విలువ రూ.444 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా.

11. చ‌ర‌ణ్ విష‌యానికొస్తే ఆయ‌న ఆస్తుల విలువ రూ.1300 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా.

12. ఎడ్యూకేష‌న్ క్వాలిఫికేష‌న్ విష‌యానికొస్తే.. జూనియ‌ర్ ఎన్టీఆర్ గుంటూరు స‌మీపంలోని విజ్ఞాన్ క‌ళాశాల నుంచి గ్రాడ్యుయేష‌న్ చేసారు.


13. రామ్‌చ‌ర‌న్ ఎడ్యూకేష‌న్ క్వాలిఫికేష‌న్ విష‌యానికొస్తే.. హైద‌రాబాద్‌లోని సెయింట్ మేరీస్ క‌ళాశాల నుంచి బీకామ్ చ‌దివారు.

14. వీరిద్ద‌రికీ ఉన్న ఓ కామ‌న్ పాయింట్ ఏమిటంటే.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఇద్ద‌రూ కూడా మొద‌టి ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్నారు.

15. ఇద్ద‌రికీ బైక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల్ల మెయింటైన్స్ చేయ‌లేక‌పోతున్నారు. అయితే చ‌ర‌ణ్‌కు మాత్రం రెండు గుర్రాలు ఉన్నాయి. పారితోషికాల విష‌యంలో ఇద్ద‌రూ స‌మాన‌మే. కాక‌పోతే యాడ్స్ రూపంలో ఎన్టీఆర్ కొంత ఎక్కువ సంపాదిస్తున్నారు.

Also read: జెంటిల్‌మెన్ సినిమాలో హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? 
Also Read: ప్రియుడితో లేచిపోయింద‌నే రూమ‌ర్స్‌ను ఖండించిన రాజ‌శేఖ‌ర్ కూతురు..!

Visitors Are Also Reading