Telugu News » Blog » Shivatmika Rajashekar: బాయ్ ఫ్రెండ్ తో పోయింది ఎవరు ? నేనా, మా అక్కనా ? అంటూ రాజశేఖర్ కూతురు శివాత్మిక ఫైర్ !

Shivatmika Rajashekar: బాయ్ ఫ్రెండ్ తో పోయింది ఎవరు ? నేనా, మా అక్కనా ? అంటూ రాజశేఖర్ కూతురు శివాత్మిక ఫైర్ !

by Anji
Ads

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌చ్చిన దొర‌సాని సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది హీరో రాజ‌శేఖ‌ర్ కూతురు శివాత్మిక‌. మొద‌టి సినిమా అనుకున్నంతగా ఆక‌ట్టుకోలేక‌పోయినా న‌టిగా మాత్రం ఈ భామ‌కు మంచి మార్కులే ప‌డ్డాయి.

ప్ర‌స్తుతం కృష్ణవంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న రంగ మార్తాండ‌లో నటిస్తున్న శివాత్మిక‌పై సోష‌ల్ మీడియాలో చీఫ్ గాసిఫ్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కేవ‌లం వ్యూస్ కోసం రాశారో లేదో తండ్రి రాజ‌శేఖ‌ర్ అంటే గిట్ట‌ని వాళ్లు ఈ ప‌ని చేసారో కానీ.. శివాత్మిక త‌న ప్రియుడితో వెళ్లిపోయిందని ఓ వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ వార్త‌పై శివాత్మిక ఫైర్ అయ్యారు. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ వార్త‌ను ఆమె ఖండించారు.

త‌న కుటుంబంతో దుబాయ్‌లో ఉన్న ఫోటోను ఆమె చేశారు. త‌న‌పై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారానికి శివాత్మిక బ‌దులిస్తూ.. తాను ఎవ‌రితోనూ వెళ్లిపోలేద‌ని త‌న పేరేంట్స్‌తో దుబాయ్ వ‌చ్చానంటూ ఓ ఫోటోను పంచుకుని క్లారిటీ ఇచ్చింది. రూమ‌ర్స్ అంటే కొంత‌లో కొంత అయిన న‌మ్మ‌శ‌క్యంగా ఉండాలంటూ ఇలాంటి రూమ‌ర్స్ న‌మ్మొద్దంటూ ఓ పోస్ట్ చేసారు. ప్రియుడితో పారిపోయాను అని వార్త‌లు రాస్తున్నారు. ఇంత‌కు పారిపోయింది నేనా..? మ‌ఆ అక్క‌నా..? అస‌లు బాయ్‌ఫ్రెండ్ ఎవ‌రో నెక్ట్స్ లెవ‌ల్ న్యూస్ రాస్తున్నారు. ఇలాంటి రూమ‌ర్స్ రాసేట‌ప్పుడు కొంచెం క్లారిటీగా రాయండి అని ఫైర్ అయింది శివాత్మిక‌. రాజ‌శేఖ‌ర్ అండ్ ఫ్యామిలీ వీలైనంత‌గా వివాదాల‌కు దూరంగా ఉంటున్నారు.

Also  Read :  ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ చ‌ద‌వు, ఆస్తులకు సంబంధించి ఈ 15 విష‌యాలు మీకు తెలుసా..?


You may also like