సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా చాలా నేచురల్ గా కనిపించే ఈ బ్యూటీ తన నటన, డ్యాన్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంది. దాదాపు స్టార్ హీరోల సరసన నటించె అవకాశాలను అందిపుచ్చుకుంది.
Did Sai Pallavi secretly married to Rajkumar Periyasamy
ఇక సాయి పల్లవికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సాయి పల్లవి ఓ ఫోటోలో పూల దండలు వేసుకుని వివాహం చేసుకున్నట్టుగా కనిపించింది. దీంతో సాయి పల్లవి వివాహం చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ మధ్యకాలంలో సాయి పల్లవి సినిమాలో నటించడం లేదు. దీంతో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యి సాయి పల్లవి సినిమాలలో నటించడం మానేసిందని అనుకుంటున్నారు.
Advertisement
Advertisement
ఇక విరాటపర్వం సినిమా అనంతరం సాయి పల్లవి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సాయి పల్లవి తమిళంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయింది. ఇందులో భాగంగానే సాయి పల్లవి ఒక ఫోటోలో దండలతో కనిపించింది. దీంతో వివాహం జరిగిందని అంతా అనుకున్నారు. కానీ ఆ ఫోటో పెళ్లి ఫోటో కాదని, అది ఓ సినిమా కార్యక్రమంలోని పూజ ఫోటో అని తెలిసి తన ఫ్యాన్స్ కూల్ అయ్యారు.
ఇవి కూడా చదవండి
- ప్రపంచ కప్ కోసం టీమిండియా జెర్సీ ఇదే…పెను మార్పులతో !
- Salaar : ప్రభాస్ ‘సలార్’లో త్రిష, ఐశ్వర్య రాయ్.. ఏందయ్యా ఇది!
- Nara Brahmani : చంద్రబాబు అరెస్ట్….పాదయాత్రకు సిద్దమైన బ్రహ్మణి ?