గత ఏడాది అక్టోబర్ లో అకస్మాత్తుగా పునీత్ రాజ్ కుమార్ తిరిగిరాని వెళ్లిన విషయం విధితమే. కన్నడ పునీత్ రాజ్ కుమార్‌కి కోట్లలో అభిమానులున్నారు. ఇప్పటికీ అభిమానులు పునీత్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజుతో పునీత్ మరణించి సరిగ్గా ఏడాది గడుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ గొప్ప నటుడు మాత్రమే కాదు.. పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. పునీత్ చేసిన సేవలను గుర్తిస్తూ కర్ణాటక ప్రభుత్వం “కన్నడరత్న” అనే బిరుదుని ప్రకటించారు.
Also Read : సోషల్ మీడియా లో ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసిన నిత్యామీనన్.. అసలు విషయం ఏంటంటే ?
Advertisement
నవంబర్ 01న కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై ఆధ్వర్యంలో ఈ బిరుదును అందించబోతున్నారు. మరోవైపు పునిత్ జ్ఞాపకార్థం నవంబర్ 01న నిర్వహించే బహిరంగ సభలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగులు కలిగిన ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి భారీ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీ తో ఈ విగ్రహాన్ని తయారు చేశారు.
Advertisement
Also Read : చిరంజీవి డ్యాన్స్ గురించి ఎన్టీఆర్ జపాన్ లో ఏం చెప్పారో తెలుసా ?
చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు. సౌత్ నుంచి ఇద్దరూ బిగ్ స్టార్లు హాజరుకానున్నారు. వారిలో ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్ కాగా.. మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఎన్టీఆర్ వేదిక పంచుకోవడం ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్‌కి పునీత్ రాజ్ కుమార్‌కి మధ్య మంచి అనుబంధమే ఉంది. పునీత్ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీకి, పునీత్ కుటుంబానికి దశాబ్దాలుగా మంచి రిలేషన్ కొనసాగుతుండడం విశేషం.
Also Read : అప్పులు తీర్చేందుకు కృష్ణ దగ్గర కొనుగోలు చేసిన భూమిని అమ్మేసిన చిరు….! ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి..?